సాక్షి, ఏలూరు జిల్లా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు.. నూజివీడు టీడీపీలో చిచ్చు రాజేశాయి. వెంకట్రావుపై నూజివీడు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నూజివీడు నియోజకవర్గంపై గాలి వార్తలను ప్రచారం చెయొద్దు.. ఏ ఆధారాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం పెట్టారంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు.
ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మా మనోభావాలను దెబ్బతీశారు. నూజివీడులో అక్రమ మైనింగ్ జరగుతుందని ఎవరికైనా చెప్పారా?. మంత్రి కొలుసు పార్ధసారధి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారా?. ఎమ్మెల్యే యార్లగడ్డ వ్యాఖ్యలు నూజివీడు టీడీపీ నేతలందరినీ అవమానించినట్లుగా ఉన్నాయి. నూజివీడులో అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో యార్లగడ్డ వచ్చి నిరూపించాలి. మాపై నింద వేసి చేతులు దులిపేసుకోవాలని చూడటం ఎమ్మెల్యే యార్లగడ్డకు సరికాదు. నూజివీడు గురించి మాట్లాడే ముందు మంత్రి పార్థసారధితో మాట్లాడితే బాగుంటుంది’’ అని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!
Comments
Please login to add a commentAdd a comment