Yarlagadda Venkatrao
-
లోకేష్‌ను బుట్టలో వేసుకునే ప్లాన్.. మొత్తానికే మోసం!
వారికి ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకమే లేదు. కాని ఊహించని విజయం వారిని వరించింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గెలవం అనుకున్న సీట్లలో గెలిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులపై కన్ను పడింది. క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ కావాలంటే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ప్లాన్ చేశారు. మంత్రి పదవుల కోసం బరితెగించి తమ ప్రత్యర్థులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగించారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు?తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం కృష్ణాజిల్లా. సామాజికవర్గం పరంగానూ...పార్టీ పరంగానూ బలమైన జిల్లా కావడంతో ఇక్కడినుంచి గెలుపొందిన నేతలకు పార్టీలోనూ అంతే వెయిటేజ్ ఉంటుంది. ఐతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలవడంతో మంత్రివర్గంలో తమకు స్థానం దక్కదేమో అనే టెన్షన్ గన్నవరం, గుడివాడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మొదలైందట. గెలిచినవారందరూ మంత్రి పదవుల కోసం తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తుంటే ఈ ఇద్దరు మాత్రం...పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి అధికారం చెలాయించే చినబాబు లోకేష్‌ను ప్రసన్నం చేసుకుంటే తమ పని సులువు అవుతుందని భావించారట. పార్టీలో నెంబర్ టూగా ఉన్న లోకేష్ దృష్టిలో పడితే తమ స్థానం పదిలమనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.తమ లక్ష్యం నెరవేరాలంటే వైఎస్ఆర్సీపీలోని చిన్నా చితకా నాయకులు, క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుంటే వర్కవుట్ కాదని భావించారట. అందుకే గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెనిగండ్ల రాము వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. గుడివాడలో ఎలాగైనా గెలవాలనుకున్న చంద్రబాబు కోరిక తీరింది కాబట్టి...కొడాలి నానిని కూడా ఇబ్బంది పెడితే పార్టీ దృష్టి ...చినబాబు దృష్టి తనపై పడుతుంది....అప్పుడు మంత్రి పదవి రేసులో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన చేశారట వెనిగండ్ల రాము. ఈ ఆలోచనతోనే కౌంటింగ్ పూర్తయిన రోజు రాత్రి కొడాలి నాని కార్యాలయంపై దాడి చేయించిన వెనిగండ్ల రాము..తర్వాత కొడాలి నాని ఇంటి పైకి కూడా కొంత మందిని టీడీపీ గూండాలను ఉసిగొల్సి పార్టీ వర్గాల్లో చర్చకు తెరతీసారట.గుడివాడలో వెనిగండ్ల రాము అనుసరించిన స్ట్రాటజీనే గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా అమలు చేశారట. కొడాలి నాని తర్వాత టీడీపీ ఓడించాలనుకున్న నేతల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అటు గుడివాడతో పాటు ఇటు గన్నవరంలోనూ టీడీపీ గెలవడంతో కచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని యార్లగడ్డ ఆశపడ్డారట. అందుకే విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి పై టీడీపీ గూండాలు ... కిరాయి మూకలతో దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. వంశీ ఇంటిపై కత్తులు...కర్రలు...రాళ్లతో దాడి చేశారు. భారీగా మోహరించిన పోలీసులు అతికష్టం మీద వంశీ ఇంటి పరిసరాల నుంచి టీడీపీ గూండాలను తరిమికొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీ ఇంటిపైకి యార్లగడ్డ వెంకట్రావ్ మనుషులతో పాటు విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమా కూడా తన గూండాలను పంపించి దాడి చేయించారని తెలుస్తోంది.టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు , లోకేష్ కు టార్గెట్ లిస్ట్ లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ళపై అటాక్ చేయడం వల్ల అధిష్టానంతో పాటు చినబాబు దృష్టిలో తాము హీరోలుగా నిలుస్తామని...తద్వారా క్యాబినెట్ లో చోటు దక్కడం ఖాయమని యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, బొండా ఉమా భావించారట. కట్ చేస్తే.. చంద్రబాబు మంత్రుల జాబితా ప్రకటించాక వారి ఆలోచనలు తారుమారై..ఆశలు ఆవిరయ్యాయట. కూటమి క్యాబినెట్ లో యార్లగడ్డకు కానీ ... వెనిగండ్ల రాముకి కానీ.. బోండా ఉమాకు కానీ చోటు దక్కపోవడంతో ముగ్గురూ షాక్‌కు గురయ్యారట. చినబాబును బుట్టలో వేసుకుందామని ఆలోచిస్తే... మొత్తానికే మోసం వచ్చిందని... ఇప్పుడేం చేయాలో అంటూ దిక్కులు చూస్తున్నారని కృష్ణా జిల్లాలో టాక్ నడుస్తోంది. -
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
యార్లగడ్డకు ఎదురుగాలి!
సాక్షి ప్రతినిధి,విజయవాడ: గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది. ఆయన నోటి దురుసుతనం, అహంకారం కొంపముంచుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరికూడ చేరనీయడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన వర్గాలు కనీస గౌరవంకూడా దక్కటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పెరిగిన అంతరం ఇటీవల హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించ లేదు. దీంతో కాపులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జనసేన, కాపు సామాజిక వర్గాలు యార్లగడ్డకు మధ్య అంతరం మరింత పెరిగింది. బీసీ, ఎస్సీ వర్గాలను పట్టించుకోక పోవడంతో వారూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు తమ కుటుంబ సభ్యులను పంపి మమ అనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాలను చిన్న చూపుచూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్గాల వారు షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతిని సబ్బుతో కడిగి, శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారని ఆపార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. దీంతో ఆయన ఎస్సీలపై ఎంత సామాజిక వివక్ష చూపుతున్నారో అర్థమవుతోందని తెలుస్తోంది. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు కాకుండా ఇతరులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.బీజేపీ సహకారం అంతంతమాత్రం నియోజకవర్గంలో బీజేపీ మాత్రం ఆయన అభ్యర్థత్వాన్ని బలపరచటం లేదు. నియోజక వర్గంలో బీజేపీలో కీలకంగా ఉండే కొర్రపోలు శ్రీనివాస్, సర్నాల విజయదుర్గ, రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి పూర్తిగా సహకారం లభించడంలేదు. పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ టీడీపీలోని వారికే తాయిలాలు ఇచ్చి, ప్రలోభపెట్టి వారికే కండువాలు కప్పి, పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు అంటూ, పచ్చ మీడియాలో ఉదరగొడుతున్నారు. యార్లగడ్డ సమక్షంలో డబ్బుకోసం ఆయన పక్షాన చేరినవారంతా, ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా బస్సుయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ప్రచారం, హడావుడి అంతా పాలపొంగు లాంటిదేనని, ఆయనకు ఈసారీ ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజక వర్గ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వంశీ ప్రచార జోష్ ఇప్పటికే గన్నవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హాట్రిక్ సాధించేందుకు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 58 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ సీపీకి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజక వర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలనుంచి అనూహ్య స్పందన లభించింది. నామినేషన్ కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు. ఈ పరిణామాలన్నీ నియోజక వర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి. అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి కష్టాల్లో పలు పంచుకుంటున్న వైనం నియోజక వర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రచారానికి జనాలు అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు. నియోజక వర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది, ఇవన్నీ ఈ విజయానికి కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
యార్లగడ్డకు వల్లభనేని స్ట్రాంగ్ వార్నింగ్
-
యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారేమో!: సజ్జల
సాక్షి, గుంటూరు: గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్‌బై ప్రకటించడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని.. యార్లగడ్డ మాటలు చూస్తుంటే ఆయన ముందే నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేయాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎవరిని అవమానించడం.. బాధించడం అనేది ఉండదు. ఏ పార్టీలోనైనా ఇలాంటివి సహజం. ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఏ పార్టీలోనైనా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలనే కోరుకుంటాం. సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడాలే తప్పా.. వేదికలపై ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. ‘‘యార్లగడ్డ గతంలో మాపార్టీ నుంచి పోటీ చేశారు. టికెట్ ఆశించేవాళ్లు ఎంతమంది ఉన్నా టికెట్ ఒకరికే వస్తుంది. ఆ విషయమే నేను యార్లగడ్డ కి చెప్పాను. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే పార్టీలో మాట్లాడవచ్చు. కానీ, పబ్లిక్ గా మీడియాతో మాట్లాడతానంటే ఎలా?. వరుసగా మీటింగులు పెట్టి అలా మాట్లాడుతున్నారు. ముందే పార్టీ మారాలనే ఇలా మాట్లాడుతున్నారేమో?. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నిరాదరణ అయినట్టు కాదు. సీఎంని కలవాలని ఆయన అనుకుంటే ప్రాపర్ వేలో కలవచ్చు. లేదా నాయకులను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీడియా ద్వారా మాట్లాడతానంటే అది కరెక్టు కాదు.’’ పార్టీ కోసం పని చేసేవారికి గుర్తింపు ఉంటుంది. బలమైన పార్టీ కాబట్టి చాలామంది భవిష్యత్తును ఆశిస్తారు. కానీ, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని సజ్జల తెలిపారు. యార్లగడ్డ ఎపిసోడ్లో మీడియా వక్రీకరించిన దాఖలాలు ఉన్నాయని సజ్జల ప్రస్తావించారు. యార్లగడ్డను నేను అవమానించినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. యార్లగడ్డను పోతేపోనీ అని నేను అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అలా నేను ఎందుకు అంటాను. నేనే కాదు మా పార్టీలో ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. యార్లగడ్డను ఎవరూ అవమానించలేదు. యార్లగడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా వాళ్లు చెప్పారు అని సజ్జల చెప్పారు. పవన్, చంద్రబాబు ఒక్కటే ఆర్కెస్ట్రా సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్ చెబుతూ వస్తున్నాడు. దీనికోసం పవన్ ఎవరితోనైనా కలుస్తారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ చేస్తారు. పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయి. చంద్రబాబుకు ఆర్కెస్ట్రా లాగా పవన్ వ్యవహరిస్తున్నారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాం కాబట్టి.. సీఎం జగన్ వైజాగ్ వెళ్తున్నారు కాబట్టి.. పవన్ ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు పాలనకు సరిగ్గా సరిపోతుంది. విశాఖలో క్రైం పెరిగిందంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు ఎన్ని చేసినా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుంది. పిట్టలదొరల్లాగా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గం ప్రశాంతంగా బతకలేదు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం ఏశారు?. చంద్రబాబు విజనరీలాగ మాట్లాడుతున్నారా?. ఇలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఈ రాష్ట్రం ఏం కావాలి?. సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ తానే కనిపెట్టానంటుంటే ఆయన మానసిక స్థితి ఏంటి?. ఈయన్ని సీఎం సీట్లో కూర్చోపెట్టాలనుకునే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి?. అసలు వీరిని పగటివేషగాళ్లు అనాలా? ప్రతిపక్ష నేతలు అనాలా?. పిట్టలదొరలు లాగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా.. సంక్షేమ పథకాలను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఆ ఫలితం రేపు ఎలక్షన్లలో కనిపిస్తుంది అని సజ్జల విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఓ ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో అవాస్తవాలు రాయిస్తోంది! -
వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడను..
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఎమ్మెల్యే వంశీ తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యార్లగడ్డ వెంకట్రావు సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిస్కరించేందుకు రాజకీయాల్లోకి రావాలి. ప్రజలకు సమస్యలు సృష్టించేందుకు రాజకీయాల్లోకి రాకూడదు. క్రియశీలక రాజకీయాల్లోకి నేను కొత్తగా వచ్చానే గానీ, మా కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. ప్రాణహాని ఉందంటూ నేనేమీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విజయవాడ సీపీ కలవమంటేనే మా పార్టీ నేత దాసరి బాలవర్ధన్‌రావుతో వెళ్లి కలిశాను. చదవండి: (ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ వైరల్) వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడితే గన్నవరం వచ్చేవాడినే కాదు. వంశీ ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేను. నేను గన్నవరం నియోజకవర్గంలో ప్రతీ గడపకు వెళ్ళాను. ఎప్పుడూ స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పడం కూడా నేను ఇష్టపడలేదు. అతని అరాచకాలు, దోపిడీల గురించి ప్రజలే చెప్పారు. ప్రజలు చెప్పిన దురాగతాలు గురించే నేను చెప్పాను. వంశీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎమ్మెల్యే వంశీ ఐదేళ్లు ప్రజలని భయబ్రాంతులకు గురిచేశారు. నేను అమెరికా నుంచి మంచి చేద్దాం అని రాజకీయాల్లోకి వచ్చాను కానీ దోచుకుందాం అని కాదు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. ఎమ్మార్వోలను మట్టి రెవెన్యూ అధికారులగా మార్చుకుని మట్టి తవ్వుకున్న వ్యక్తిని కాను. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడవద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తన అక్రమాలపై విచారణ జరుపుతారనే భయంతోనే వల్లభనేని వంశీ నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు. వంశీ తన ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు, పోలీస్ శాఖ వాళ్లే నాకు ఆ విషయం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో చెరువులని అక్రమంగా తవ్వింది నిజమా కాదా. మా పార్టీ అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో వంశీ ఇలా వ్యవహరిస్తున్నాడు. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తాం. గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను మట్టి తవ్వలేదు. నియోజకవర్గంలో మొత్తం చెరువులు తవ్వి మట్టి దోచింది నేను కాదు అని చెప్పాను. వంశీ మీరు మీ భార్య 2014 ఎన్నికలకు ముందు బెంగుళూరుకు వెళ్లి జగన్ గారిని కలిసింది వాస్తవం కాదా. ఆంధ్రజ్యోతి పత్రికలో నా ఇల్లు అక్రమ కట్టడం అని రాశారు, నేను అన్ని అనుమతులు తీసుకునే కట్టాను. వంశీ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేయడం వంశీకి అలవాటు. వంశీ అరాచకాలు టీడీపీ నేతలే భరించలేక పోతున్నారు. నేను వంశీలా సంస్కార హీనుడిని కాదు. ఆయన తనకు అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాయించుకున్నారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చరిత్ర వంశీది. గన్నవరం నియోజకవర్గంలో చెరువులని అక్రమంగా తవ్వింది నిజమా కాదా. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తాం. నీ ఇల్లు నువ్వు చక్కపెట్టుకోకుండా మా గురించి నీకు ఎందుకు. నన్ను, మా క్యాడర్ ని భయపెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి బెదిరింపులకు లొంగే వ్యక్తిని కాదు. బ్రహ్మలింగేశ్వర స్వామి అన్ని చూసుకుంటారు.’ అని అన్నారు. -
నాపై వంశీ తప్పుడు విమర్శలు చేస్తున్నారు
-
ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ వైరల్
సాక్షి, గన్నవరం : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా... కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇంకా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు నివాసానికి ఇటీవల వల్లభనేని వంశీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వంశీ నుంచి తనకు ప్రాణహాని ఉందని యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ రాశారు. యార్లగడ్డ వెంకట్రావుతో మాట్లాడాలనే తాను ఆయన ఇంటికి వెళ్లానంటూ వంశీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్
-
ఎల్లో మీడియావి తప్పుడు కథనాలు
సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. గన్నవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత దాసరి బాలవర్ధనరావు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు స్టువర్టుపురం దొంగల్లా దోచుకుంటున్నరని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మైనార్టీలపై దాడులు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో వైఎస్సార్ సీపీ నేతలపై వందల్లో కేసులు నమోదు అయ్యాయని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ నాయకులు గుడిని, గుళ్లో లింగాన్ని మింగే విధంగా దోపిడీకి పాల్పడుతున్నారని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున వలసలు
విజయవాడ రూరల్: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో టీడీపీ, కాంగ్రెస్ నుంచి సుమారు 300 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరికి గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరగడం లేదు కాబట్టే టీడీపీ నుంచి 300 కుటుంబాలు వైఎస్సార్సీపీ చేరాయని స్ఫష్టంగా పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకోవడంలో మునిగిపోయారని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. -
చింతమనేని ఇక నీ ఆటలు సాగవ్
పెదపాడు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటలు ఇక సాగవని, ఆయన పదవి ఊడటానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడులో దెందులూరు కార్యకర్తల సమావేశంలో అబ్బయ్య చౌదరీ మాట్లాడారు. మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటిలోనూ చింతమనేని దోపిడీ పాల్పడ్డారని ఆరోపించారు. అప్పన ప్రసాద్‌పై అక్రమ కేసులు , రౌడీషీట్‌తో వేధించినా ఆయన భయపడలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించమని అన్నారు. చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి దెందులూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చింతమనేని రౌడీయిజంతో దెందులూరు ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని వివరించారు. చింతమనేని, వల్లభనేని ఇద్దరూ దోపిడీదారులే: దుట్టా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా దోపిడీదారులేనని వైఎస్సార్సీపీ నేత దుట్టా రామచంద్ర రావు విమర్శించారు. నియోజకవర్గాల్లో సెటిల్మెంట్లు, ఇసుక, మట్టి అక్రమాలే కనిపిస్తాయని చెప్పారు. గాంధీజీకి జాతిపిత బిరుదును నేనే ఇచ్చానని కూడా చంద్రబాబు చెప్పుకోగల ఘనుడని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు ఎక్కడ పేరొస్తోందనే భయంతోనే పోలవరం కాలువకు ఆనాడు దేవినేని ఉమ లాంటి వారు అడ్డుపడ్డారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత ఒక్క కంపెనీ రాలేదు: యార్లగడ్డ లోకేష్ లాంటి దిక్కుమాలిన ఐటీ మంత్రి వచ్చిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాలేదని గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. లోకేష్ కాకుండా మరెవరైనా ఐటీ మంత్రి అయ్యింటే కనీసం ఒకటో, రెండో ఐటీ కంపెనీలు వచ్చేవని చెప్పారు. చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తుతోనే అధికారంలోకి వచ్చారని, కానీ వైఎస్ జగన్ ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నుంచి ఐదుగురు ఎంపీలు రాజీనామా చేయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం చాలా దుర్మార్గమన్నారు. -
సేవ్ డెమోక్రసీ అంటే చంద్రబాబుకి తెలుసా?
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టు పొత్తులు దేశప్రయోజనాల కోసం కాదని తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమని గన్నవరం వైఎస్సార్సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. చంద్రబాబుకి ఎవరోఒకరితో పొత్తుండాలని, 6 నెలలు కూడా ఒంటరిగా పార్టీని నడపలేకపోయాడని పేర్కొన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. సేవ్ డెమోక్రసీ అంటూనే ఆ నాడు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారని యార్లగడ్డ వెంకట్రావ్ మండిపడ్డారు. మళ్లీ సేవ్ డెమోక్రసీ అంటూ కాంగ్రెస్ పార్టీతో కలిశారన్నారు. అసలు సేవ్ డెమోక్రసీ అంటే ఏంటో చంద్రబాబుకి తెలుసా, పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడమా..? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడమా..? అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరుకు ఎన్టీఆర్, హరికృష్ణ ఆత్మలు క్షోభిస్తాయన్నారు. రాజధానిని సింగపూర్‌కి తాకట్టు పెట్టి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కి తాకట్టు పెట్టారన్నారు. -
కాల్ సెంటర్లతో ఐటీ ఉద్యోగాలా?
కృష్ణా జిల్లా: ఐటీ కంపెనీకి కాల్ సెంటర్‌కు తేడా తెలియని మంత్రి నారా లోకేష్ అని వైఎస్సార్సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాల్ సెంటర్లను ప్రారంభించి లక్ష ఉద్యోగాలు ఇస్తానని మంత్రి లోకేష్ అనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కాల్సెంటర్లో ఐటీ ఉద్యోగాలు ఎలా ఇస్తాడో లోకేష్ బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ అనుభవం ఉన్న తాను అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐటీ విభాగంలో అనుభవం ఉన్న తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి మీ ముందుకు వచ్చానని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేల మాదిరి మట్టి, ఇసుక వంటి అవినీతి పనులు చేయనని వెల్లడించారు. జగనన్న నేతృత్వంలో నియోజకవర్గ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తానని వివరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంఘీభావ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సంఘీభావ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మాదు శివరామకృష్ణ, దేవగిరి ఓంకార్ రెడ్డి ,యర్కారెడ్డి నాగిరెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వరరావు, నక్కా గాంధీ, ఎండీ గౌసాని, బడుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.