ఎల్లో మీడియావి తప్పుడు కథనాలు | Dasari Balavardhan Rao Clarifies on Yellow Media Rumours | Sakshi
Sakshi News home page

గన్నవరం బరిలో యార్లగడ్డ వెంకట్రావే: దాసరి 

Published Fri, Mar 15 2019 6:52 PM | Last Updated on Fri, Mar 15 2019 7:08 PM

Dasari Balavardhan Rao Clarifies on Yellow Media Rumours - Sakshi

సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. గన్నవరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత దాసరి బాలవర్ధనరావు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు స్టువర్టుపురం దొంగల్లా దోచుకుంటున్నరని విమర్శించారు. 

స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మైనార్టీలపై దాడులు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో వైఎస్సార్‌ సీపీ నేతలపై వందల్లో కేసులు నమోదు అయ్యాయని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ నాయకులు గుడిని, గుళ్లో లింగాన్ని మింగే విధంగా దోపిడీకి పాల్పడుతున్నారని యార‍్లగడ్డ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement