Dasari Balavardhana Rao
-
'ఇచ్చిన ప్రతీ హామీనీ జగన్ నెరవేరుస్తున్నారు'
సాక్షి, కృష్ణా : ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నారన్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తుళ్లిమిల్లి జాన్సీలక్ష్మి, మద్దినేని వెంకటేశ్వరరావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, వింత శంకర్ రెడ్డి, దేవగిరి ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియావి తప్పుడు కథనాలు
సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. గన్నవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత దాసరి బాలవర్ధనరావు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు స్టువర్టుపురం దొంగల్లా దోచుకుంటున్నరని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మైనార్టీలపై దాడులు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో వైఎస్సార్ సీపీ నేతలపై వందల్లో కేసులు నమోదు అయ్యాయని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ నాయకులు గుడిని, గుళ్లో లింగాన్ని మింగే విధంగా దోపిడీకి పాల్పడుతున్నారని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన దాసరి బాలవర్థన్ రావు
-
తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్..
సాక్షి, హైదరాబాద్ : గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్ రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో దాసరి బాలవర్థన్ రావు ఇవాళ ఉదయం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాలవర్థన్ రావుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్ రావు సోదరుడు దాసరి జై రమేష్ పాల్గొన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్...వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా దాసరి బాలవర్ధన్ రావు మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ కోసం తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్ రావు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు. -
గన్నవరంలో వైఎస్సార్ సీపీ నేతల సంబరాలు
సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం గన్నవరంలో సంబరాలు చేసుకున్నారు. విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ ...వైఎస్సార్ సీపీలోకి చేరనున్న నేపథ్యంలో ఆయన రాకను స్వాగతిస్తూ బాణాసంచా కాల్చారు. కాగా జై రమేష్ ఇవాళ మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం త్వరలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో జై రమేష్ గన్నవరం నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్థనరావు 1999, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్కనపెట్టి ...వల్లభనేని వంశీని రంగంలోకి తెచ్చారు. గత ఎన్నికల్లో కూడా గన్నవరం నియోజకవర్గం సీటు ఆశించిన బాలవర్ధనరావుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. -
గన్నవరం టీడీపీ రెండు ముక్కలు !
బజారుకెక్కిన దాసరి, వంశీ పోరాటం టపాసులు పేల్చిన వంశీ వర్గీయులు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. పార్టీ టికెట్టు ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు, డాక్టర్ వంశీమోహన్ మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న అంతర్గత గొడవలు బజారు కెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా బలాబలాలు తేల్చుకునేందుకు వారిద్దరూ సమాయత్తమైనట్లు సమాచారం. టీడీపీలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు పావులు కదుపుతున్నారు. తమ నాయకునికి టీడీపీ అధినేత గన్నవరం సీటు ఇస్తానని హామీ ఇచ్చారని ఆదివారం గ న్నవరంలో వంశీ వర్గీయులు టఫాసులు కాల్చి హంగామా చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దాసరి వెంకట బాలవర్దనరావు, ఆయన వర్గీయులు కలవరం చెందారు. అదంతా పచ్చి అబద్దమని పార్టీ నాయకులు కార్యకర్తలకు దాసరి స్వయంగా ఫోన్ చేసి చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో దాసరి, వంశీ వర్గాలు పోటాపోటీగా స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా వంశీని పనిచేసుకోమన్నారని ఆయన వర్గీయులు గ్రామాల్లో నాయకులకు ఫోన్లు చేసి ప్రచారం చేశారు. ఈ హడావిడితో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రతి ఎన్నికల మాదిరిగా ఈ సారీ గన్నవరం టీడీపీ టికెట్టు విషయం వివాదాస్పదం కాక తప్పదని భావిస్తున్నారు. మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకట స్థితి నెదుర్కొంటున్నారు. ఈ ప్రభావంతో కొద్ది రోజుల్లో జరుగనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ వర్గంలో చేరాలో తెలియక పార్టీ నాయకులు అయోమయం చెందుతున్నారు. గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ టీడీపీలో వంశీ, దాసరి వర్గాలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. పలు గ్రామాల్లో టీడీపీ రెబల్స్ అభ్యర్థులు రంగంలో దిగారు. మళ్లీ అదే పరిస్థితి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పునారావృతం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వంశీ వర్గీయుల ప్రచారం .... సోషనల్ మీడియాలోనూ వంశీమోహన్‌కు గన్నవరం టికెట్ కేటాయించినట్లు ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో, నెట్లో వంశీ అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. వంశీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు. టికెట్ నాదే : వంశీ గన్నవరం, న్యూస్‌లైన్ : గతంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం మేరకు గన్నవరం నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ టికెట్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకే కేటాయించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వల్లభనేని వంశీమోహన్ పునరుద్ఘాటించారు. శ్రీనగర్‌కాలనీలోని వల్లభనేని అరుణ ట్రస్టు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్ట పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు జిల్లా పార్టీ పరిశీలకులు సుజానాచౌదరి, బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో బాబు తనతో, దాసరితో విడివిడిగా సమావేశమయ్యారని తెలిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు దాసరి గత ఎన్నికల్లో ఇదే చివరిసారని చెప్పడంతో ప్రస్తుత ఎన్నికల్లో సీటు తనకే కేటాయిస్తున్నట్లు బాబు హామీ ఇచ్చారని చెప్పారు. అది తప్పుడు ప్రచారం : దాసరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్టు తనకు కేటాయించారని, తానే అభ్యర్థినని గ్రామాల్లో వంశీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు చెప్పారు. ఆదివారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ వంశీమోహన్, ఆయన వర్గీయులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. తాను చంద్రబాబును కలిసి ఇక్కడ జరుగుతున్న విషయాలను వివరించినట్లు తెలిపారు. కేవలం ప్రజలను, పార్టీ నాయకులను అయోమయం చేయటానికే వంశీ ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని దాసరి విమర్శించారు. శనివారం సాయత్రం తాను, వంశీ చంద్రబాబును కలిసినట్లు, ఆయన పార్టీ టికెట్టు వంశీకి కేటాయించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శనివారం ఉదయం తాను చంద్రబాబును కలిసి వంశీ చేస్తున్న అసత్య ప్రచారం గురించి ఫిర్యాదు చేశానని, ఆయన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాట్లాడదామని చెప్పారని దాసరి వివరించారు. గతంలో గద్దే రామ్మోహనరావు, 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ముందు ఇదే తరహాలో తమకు పార్టీ టికెట్ వచ్చేసిందని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. గన్నవరం అసెంబ్లీ టికెట్ విషయమై చంద్రబాబు ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని, వంశీ చెబుతున్నట్లుగా ఒప్పందాలు ఏమీ లేవని దాసరి చెప్పారు. గతంలో చంద్ర బాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తానని చెప్పిన మాటను దాసరి గుర్తు చేశారు. గన్నవరం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. -
దాసరి-వంశీ సీటు ఫైటు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీలో అసెంబ్లీ టిక్కెట్ల పోరాటం ఆ పార్టీలో కల్లోలాన్ని రేపుతోంది. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు, డాక్టర్ వంశీమోహన్లు పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకే గన్నవరం సీటు కేటాయించాలని ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల ద్వారా వారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోరాటం చేస్తున్నారు. గత మూడు మాసాలుగా వారిద్దరూ పార్టీ టిక్కెట్టు తనదంటే, తనదని ప్రచారం చేసుకుంటున్న విషయం విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఈసారి గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్టు ఇస్తానని హామీ ఇచ్చినట్లు వంశీ బహిరంగంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పంపించారని, ఈసారి గన్నవరం నుంచి అవకాశం ఇస్తానని టీడీపీ పెద్దల ఒప్పందంపై తాను చంద్ర బాబును అడిగినట్లు వంశీ అంటున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారని వంశీ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. ఈ క్రమంలో వంశీ చెప్పేదంతా అభూత కల్పనగా సిట్టింగ్ ఎమ్యెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు కొట్టిపారేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరకీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నిజాయితీగల నాయకునిగా తనకు పార్టీలో ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తనకే గన్నవరం సీటు కేటాయిస్తారని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. తనకే సీటు కేటాయించారని అసత్య ప్రచారం చేసి, తద్వారా ప్రజల్లో సానుభూతి పొంది ఇండిపెండెంటుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో వంశీ పావులు కదుపుతున్నారని దాసరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలు ప్రకటించటంతో ఇరువురు నాయకులు తమతమ వర్గాలను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న దాసరి వెంకట బాలవర్థనరావు, వంశీమోహన్లు తమ ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నారు. దాసరి గత వారం రోజులుగా నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడరూరల్ మండలాల తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈ సమావేశాలకు మండలాల పార్టీ బాధ్యులు వంశీమోహన్‌ను ఆహ్వానించటం లేదు. పిలవక పోయినా విజయవాడ రూరల్ మండల పార్టీ సమావేశానికి హాజరయ్యారు. తమ నాయకుడిని ఎందుకు సమావేశానికి ఆహ్వానించలేదని వంశీ వర్గీయులు సమావేశంలో తిరుగుబాటు చేశారు. వంశీ హాజరు కాగానే దాసరి నిష్ర్కమించారు. ఎంపీటీసీల కసరత్తు జరపకుండానే ఆయన సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. పార్టీ టిక్కెట్టు విషయంలో పైచేయి ఎవరిదనే విషయమై నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. -
గన్నవరం టీడీపీలో...మూడో కృష్ణుడు
గన్నవరం టీడీపీలో...మూడో కృష్ణుడు ఇప్పటికే దాసరి, వంశీ మధ్య పోటీ తాజాగా తెరపైకిచలసాని ఆంజనేయులు తెరవెనుక చక్రం తిప్పుతున్న దేవినేని ఉమా! సాక్షి, విజయవాడ : గన్నవరం టీడీపీలో సీట్ల సిగపట్లు తారస్థాయికి చేరుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో సీటు తమదేనంటే... తమదేనంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్లు పోటీ పడుతుంటే తాజాగా జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు తెరపైకి వచ్చారు. ఇప్పటికే దాసరి-వంశీల మధ్య తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతుండగా, తాజాగా మరో నేత తెరపైకి రావడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలే పార్టీ కొంప ముంచుతాయని ఆందోళన చెందుతున్నారు. దాసరికి తిరిగి టిక్కెట్ ఇస్తే తనకు అభ్యంతరం లేదని, లేనిపక్షంలో పార్టీలో సీనియర్ నేతనైన తనకు టిక్కెట్ ఇస్తే రైతులకు న్యాయం చేసినట్లు అవుతుందని చలసాని ఆంజనేయులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దాసరి పోటీ నుంచి తప్పుకోవాల్సివస్తే ఆయన వంశీ కంటే చలసానికే మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల తుపాన్లు వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు హనుమాన్‌జంక్షన్, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుడు చలసాని ఆంజనేయులు పక్కనే ఉండి జిల్లా రైతులకు జరుగుతున్న నష్టాన్ని, రైతుల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాలను వివరించినట్లు సమాచారం. దీంతో చలసాని అభ్యర్థితాన్ని కూడా చం ద్రబాబు పరిశీలిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెరవెనుక ఉమా మంత్రాంగం... ఒకవేళ దాసరి బాలవర్ధనరావు తప్పుకోవాల్సివస్తే గన్నవరం సీటు వంశీకి దక్కకుండా చలసాని ఆంజనేయులును జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమానే తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీటు కావాలంటూ చలసానితో ఆయనే మెలిక పెట్టించారని తెలిసింది. దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీల మధ్య ఇప్పటికే పొరపొచ్చాలు ఉన్నాయి. ఇద్దరూ మొదటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. వంశీ దూకుడును ఉమా ఎప్పుడూ అంగీకరించలేదు. దాసరికి కాని పక్షంలో వంశీ కంటే చలసాని ఆంజనేయులే మంచి అభ్యర్థి అవుతారని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. చలసాని ఆంజనేయులుకు టిక్కెట్ ఇవ్వడం వల్ల జిల్లా రైతాంగం పార్టీకి దగ్గరవుతారని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. చలసానిని రంగంలోకి దింపడం ద్వారా వంశీని ఇబ్బందిపెట్టవచ్చని ఉమా వర్గం భావిస్తోంది. ఒకవేళ చలసానిని కాదని వంశీకి టిక్కెట్ ఇస్తే రైతులు వంశీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు వీలుంటుదంటున్నారు. సీటు తనదేనంటున్న దాసరి... దాసరి బాలవర్ధనరావు విజయా డెయిరీ డెరైక్టర్‌గా ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే చైర్మన్ అవుతారని, అప్పుడు గన్నవరం సీటు ఖాళీ అయితే అది వంశీమోహన్‌కే దక్కుతుందని గన్నవరంలో ప్రచారం జరుగుతోంది. దీన్ని దాసరి బాలవర్ధనరావు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తున్నారని, అందువల్ల ఈసారి తనకే సీటు వస్తుందని ఆయన బలంగా చెబుతున్నారు. కేవలం రైతుల మీద ఉన్న అభిమానంతోనే విజయా డెయిరీ డెరైక్టర్ పదవి తీసుకున్నాను తప్ప ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకోనని చెబుతున్నారు. చంద్రబాబు వద్ద తనకు క్లీన్ చిట్ ఉండటంతో తన అభ్యర్థిత్వానికి డోకా ఉండదని అంటున్నారు. దూకుడు పెంచుతున్న వంశీ మోహన్... గన్నవరం సీటు ఇక తనదేనన్న ధీమాలో వల్లభనేని వంశీ ఉన్నారు. చంద్రబాబు తనను పిలిచి పనిచేసుకోమని చెప్పారని, త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు సమసిపోతాయని చెబుతున్నారు. దీనికి తోడు తనకు సీటు ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ తన అభిమానుల చేత పత్రికా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇక యువతను పోగు చేసి నియోజకవర్గంలో హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో భారీస్థాయిలో ప్రచారానికి సిద్ధమౌతున్నారు. వంశీ దూకుడుకు బ్రేక్ వేయడానికి చలసానిని తెరపైకి తెచ్చి రాష్ట్రస్థాయిలో సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. నన్ను కాదని ఎవరికీ ఇవ్వరు : దాసరి గన్నవరం : సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని గన్నవరం అసెంబ్లీ టీడీపీ టిక్కెట్ ఎవరికీ ఇవ్వరని శాసనసభ్యుడు డాక్టర్ వెంకట బాలవర్ధనరావు స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించే విషయమై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన తొందరపడి ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోరని చెప్పారు. ముఖ్యంగా గన్నవరం సీటు విషయమై బాబు ఎవరికీ హామీ ఇవ్వలేదన్నారు. టిక్కెట్ తనకే కేటాయించారంటూ వంశీ చేస్తున్న దుష్ర్పచారం కారణంగా నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. 1994 నుంచి పార్టీ టిక్కెట్ విషయమై నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా 2014 ఎన్నికల బరిలో టీడీపీ నుంచి తిరిగి పోటీ చేసి తీరుతానని దాసరి ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు కేటాయిస్తానని ప్రకటించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో విస్తరించి ఉన్న కృష్ణామిల్క్ యూనియన్ సేవలను పార్టీకి ఉపయోగించాలనే యూనియన్ డెరైక్టర్‌గా పోటీచేశాను కానీ, ఆ డెయిరీకి చైర్మన్ కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ రాద్ధాంతంపై పార్టీ అధినేతకు ఎటువంటి ఫిర్యాదూ చేయబోనని, ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని చెప్పారు. చివరకు అధినేత ఆదేశాల మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. బాబు వాగ్దానం చేశారు : వంశీ గన్నవరం : గతంలో కుదిరిన ఒప్పందం మేరకు గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాగ్దానం చేశారని ఆ పార్టీ విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. స్థానిక వల్లభనేని అరుణ ట్రస్టులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2009 ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ కోసం దాసరి, తాను పోటీపడగా స్వయంగా బాబు ఇద్దరి మధ్య రాజీ చేశారని, దాసరి ఇవే చివరి ఎన్నికలు అనడంతో ఆయనకు గన్నవరం టిక్కెట్, తనకు విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ కేటాయించారని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటామని దాసరి సోదరులు ప్రకటించారని గుర్తుచేశారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేగా దాసరి ఉండడంతో నాలుగేళ్లుగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ముందు మళ్లీ ఒప్పందం... పంచాయతీ ఎన్నికల ముందు తిరిగి బాబు సమక్షంలో దాసరి విజయ డెయిరీ చైర్మన్‌గా, తనను గన్నవరం శాసనసభ్యునిగా పోటీ చేసే విధంగా ఒప్పందం జరిగిందన్నారు. ఈ విషయమై విజయవాడలో జరిగిన చర్చలో దివంగత ఎర్రంనాయుడు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, కాగిత వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారని తెలిపారు. దీనిలో భాగంగానే సర్పంచ్ల ఎన్నికలలో అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కొంతమంది గిట్టనివాళ్లు తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టానని, ఏదేమైనా బాబుపై పూర్తి నమ్మకముందని చెప్పారు. 2014 ఎన్నికలలో నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు. -
రసకందాయంలో గన్నవరం రాజకీయం