
సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం గన్నవరంలో సంబరాలు చేసుకున్నారు. విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ ...వైఎస్సార్ సీపీలోకి చేరనున్న నేపథ్యంలో ఆయన రాకను స్వాగతిస్తూ బాణాసంచా కాల్చారు. కాగా జై రమేష్ ఇవాళ మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం త్వరలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో జై రమేష్ గన్నవరం నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్థనరావు 1999, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్కనపెట్టి ...వల్లభనేని వంశీని రంగంలోకి తెచ్చారు. గత ఎన్నికల్లో కూడా గన్నవరం నియోజకవర్గం సీటు ఆశించిన బాలవర్ధనరావుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment