
సాక్షి, కృష్ణా : ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నారన్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తుళ్లిమిల్లి జాన్సీలక్ష్మి, మద్దినేని వెంకటేశ్వరరావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, వింత శంకర్ రెడ్డి, దేవగిరి ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.