YSRCP 13th Annual Foundation Day Celebrations In AP Updates And Latest News - Sakshi
Sakshi News home page

‘నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు సీఎం జగన్‌’

Published Sun, Mar 12 2023 8:31 AM | Last Updated on Sun, Mar 12 2023 4:55 PM

YSRCP 13th Annual Emergence Day Celebrations In AP Updates - Sakshi

Updates.. 

విజయవాడ భవానిపురం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జండా ఎగరవేసి కేక్ కటింగ్ నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి పాలకొండ మండల చైర్మన్ కరటం రాంబాబు పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్లు తదితరులు

► నెల్లూరు పార్టీ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. 

► వైవీ సుబ్బారెడ్డి.. 12 ఏళ్ల ప్రస్థానంలో వైఎస్సార్‌సీపీ ప్రయాణం ఓ చరిత్ర. వైఎస్సార్‌ మరణంతో కుంగిపోయిన 570 కుటుంబాలను ఆదుకోవాలని తపనపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం పాటుపడ్డారు. రెండేళ్లలో 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలను గెలుపించుకున్న నాయకుడు సీఎం జగన్‌. 

 టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పడు మళ్లీ మెజార్టీతో వస్తానని చెప్పి గెలిచిన నాయకుడు సీఎం జగన్‌. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్‌ సామాజిక న్యాయం ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేసి చూపించారు. 

► ఎంపీ విజయ సాయిరెడ్డి.. మహానేత అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు. లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోంది. 

ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్‌విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ. ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాందీపలుకుతున్న దార్శనికుడి పార్టీ. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించి 98.5 శాతం వాగ్దానాన్ని అమలు చేసిన నాయకుడి పార్టీ. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వానికి అర్థం.. మారిన గ్రామం, మారుతున్న సామాజిక చిత్రం, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ అండ. ఆయన నేటి తరానికి ఆలంబన, భావితరానికి భరోసా.

► వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన సజ్జల.

► సజ్జల మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌.  విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన  స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్‌ పాలన కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ ఓ రోల్‌ మోడల్‌. వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు. 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్‌, మేరుగ నాగార్జున.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత, ఇతర నేతలు. 

సాక్షి, తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించి, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలతో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాల‌యం పిలుపునిచ్చింది. పలు సేవా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించింది. 

 అలాగే, వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర కార్యా­లయం తెలిపింది. ఇక, తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ఆవిర్భావ పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ ముఖ్య నేత‌లు హాజ‌రుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక, చెప్పని వాటితో పాటు, అనేక సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజక పరిపాలన సాగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement