‘రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’ | Kottu Satyanarayana Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బ్రోకర్‌.. లోకేశ్‌ జోకర్‌: డిప్యూటీ సీఎం సెటైర్లు

Published Tue, Sep 5 2023 5:29 PM | Last Updated on Tue, Sep 5 2023 5:34 PM

Kottu Satyanarayana Satirical Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఉదయనిధి మాటలు ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం ధర్మంకాదని హితవు పలికారు. 

కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేశ్‌ను అరెస్ట్‌ చేస్తేనే ఏపీలో శాంతి భద్రతలు నెలకొంటాయి. చంద్రబాబు అవినీతి అనకొండ. చంద్రబాబు అవినీతి రూ.118కోట్లు మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి. అమరావతి ముసుగులో చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి స్కెచ్‌ వేశారు. ఐటీ నోటీసులతో కేవలం ఆవగింజ అంత బయటపడింది. ఇంకా సింగపూర్‌ ఈశ్వరన్‌తో కలిసి పనిచేసిన అవినీతి దందా బయటపడుతుంది. చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయం. 

లోకేశ్‌ ఘనకార్యంతో పడిపోయిన టీడీపీ గ్రాఫ్‌..
రెండు వేల మంది గూండాలతో నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నాడు. లోకేశ్‌ పాదయాత్రతో టీడీపీ ‍గ్రాఫ్‌ మరింత దిగజారిపోయింది అని సెటైర్లు వేశారు. తండ్రి బ్రోకర్‌.. కొడుక జోకర్‌ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఇప్పుడు తేలిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఫేక్‌ ఉద్యమాలు చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

చంద్రబాబు పొలిటికల్‌ స్కామ్‌ స్టార్‌..
మరోవైపు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎపం మార్గాని భరత్‌ రామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీ భరత్‌ మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు పొలిటికల్‌ స్కామ్‌ స్టార్‌. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. రాజధాని అంటున్న అమరావతిలో 3వేలు ఖర్చు అయ్యే నిర్మాణాలకు 15వేలు ఎలా ఖర్చు పెట్టారో చంద్రబాబు చెప్పాలి. కోట్ల రూపాయలను టన్ను ఐరన్‌తో​ కోడ్‌ లాంగ్వేజ్‌లో చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి 18స్టేలు తీసుకుని చంద్రబాబు తిరుగుతున్నాడు. చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలి. 

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్‌.. టీడీపీ నేత అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement