కేంద్రం ఆదేశాలను బీజేపీ విస్మరించడం విడ్డూరంగా ఉంది: కారుమూరి | Karumuri Nageswara Rao Says TV Channels Rumors On Ration Distribution | Sakshi
Sakshi News home page

కేంద్రం ఆదేశాలను బీజేపీ విస్మరించడం విడ్డూరంగా ఉంది: కారుమూరి

Published Wed, Apr 20 2022 7:24 PM | Last Updated on Wed, Apr 20 2022 10:21 PM

Karumuri Nageswara Rao Says TV Channels Rumors On Ration Distribution - Sakshi

సాక్షి, తాడేపల్లి: నగదు బదిలీపై అపోహలు సృష్టిస్తున్నారని, నగదు బదిలీ ప్రారంభించాలని‌ 2017లోనే కేంద్రం సూచించిందని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాలపై అదే పార్టీ విస్మరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల ఇష్టంతోనే పైలట్ ప్రాజెక్టుగా రెండు, మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని అన్నారు.

ఇష్టం ఉన్న వాళ్లకి నగదు బదిలీ చేస్తామని, ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని అన్నారు. కార్డులు తొలగిస్తామని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవ్వరి కార్డులు తొలగించం.. జూన్‌లో కూడా కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇంకా రేటు నిర్ణయించలేదని, రూ. 16 రూపాయలంటూ కొన్ని టీవీ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజలని‌ భయభ్రాంతులకి గురి చేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement