తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకు చేర్చేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థ తెచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వలంటీర్లకు సేవారత్న, మిత్ర, వజ్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హాజరైన కారుమూరి.. మీడియాతో మాట్లాడారు. పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకే చేర్చేలా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మావాళ్ళకే చేయండి.. మావాళ్లనే చూడండి అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు భేదం లేకుండా సంక్షేమం అందరికీ అందాలని చెప్పారు. మండపాక గ్రామంలో టీడీపీ హయాంలో కోటి 8 లక్షల రూపాయిలు మాత్రమే ఖర్చు చేశారు.మండపాక గ్రామంలో వై యస్ ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల 81 లక్షల రూపాయిలు ఖర్చు చేశాము. రెండున్నర ఏళ్లలో మేము రూ. 7,109 కోట్ల తణుకు మండలానికి ఖర్చు చేశాము. 346 ఎకరాలు సేకరించి 18 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. దేశంలోని ముఖ్యమంత్రులు మన పాలనవైపు చూస్తున్నారు. 70 శాతం బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పించారు’ అని కారుమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, జేసీ మురళీ, శెట్టి బలిజ కార్పోరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment