వెరైటీగా ఓట్స్‌తో ఇలా జిలేబి ట్రై చేయండి!
కావలసినవి:
►ఓట్స్ – 1 కప్పు
►గోధుమ రవ్వ – అర కప్పు
►నీళ్లు – సరిపడా
►బెల్లం కోరు – 2 కప్పులు
►ఉప్పు – చిటికెడు
►ఫుడ్ కలర్ – కొద్దిగా (జిలేబీ కలర్)
►నూనె లేదా నెయ్యి – 1 కప్పు
తయారీ:
►ముందుగా ఓట్స్, గోధుమ రవ్వలను మిక్సీ బౌల్లో వేసుకుని.. ఒక కప్పు నీళ్లు పోసుకుని.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
►20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు, కొద్దిగా ఫుడ్‌కలర్ వేసుకోవాలి.
►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ హ్యాండ్ బ్లెండర్‌తో బాగా కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని కోన్ లాంటి ఖాళీ టొమాటో సాస్ టిన్‌లో నింపి పెట్టుకోవాలి.
►ఈ లోపు స్టవ్ మీద కళాయిలో బెల్లం కోరు, ఒక కప్పు నీళ్లు పోసుకుని.. లేత పాకం వచ్చే వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.
►మరో స్టవ్ ఆన్ చేసుకుని.. మరో కళాయిలో నెయ్యి లేదా నూనెలో ఓట్స్ మిశ్రమాన్ని జిలేబీల్లా వేస్తూ దోరగా వేయించుకోవాలి.
►వెంటనే వాటిని బెల్లం పాకంలో వేసి దేవుకుంటే సరిపోతుంది.
ఇవి కూడా ట్రై చేయండి: Oats Walnut Cutlets: ఓట్స్– వాల్‌నట్స్ కట్లెట్ తయారీ ఇలా..
ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ!
Comments
Please login to add a commentAdd a comment