న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ల మధ్య ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జోరుగా జిలేబీలు తయారు చేస్తున్నారు.
VIDEO | Jalebis being prepared at BJP headquarters in New Delhi, ahead of the counting of votes in Maharashtra and Jharkhand. #MaharashtraElection2024 #JharkhandElection2024 #ElectionResults2024WithPTI pic.twitter.com/RD4kKmB5Xx
— Press Trust of India (@PTI_News) November 23, 2024
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి 'మహాయుతి', కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (శరద్ చంద్ర పవార్)ల మహావికాస్ అఘాడి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల్లో తమదే విజయమని రెండు కూటములు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్‌లో, మహారాష్ట్రలో మహాయుతి ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడి వెనుకబడింది. జార్ఖండ్‌లో, జేఎంఎం ప్లస్ ట్రెండ్స్‌లో మెజారిటీలో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు
Comments
Please login to add a commentAdd a comment