
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేడు (బుధవారం) జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ‘నేటి పోటింగ్‌లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా ప్రధాని మోదీ ఒక సందేశం ఇచ్చారు. ‘ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.
झारखंड में आज लोकतंत्र के महापर्व का दूसरा और आखिरी चरण है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे इसमें बढ़-चढ़कर भागीदारी करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट डालने जा रहे अपने सभी युवा साथियों का मैं विशेष अभिनंदन करता हूं। आपका एक-एक मत राज्य की ताकत है।
— Narendra Modi (@narendramodi) November 20, 2024
మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది.
ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్‌లో యూపీ ఓటర్లు ఎటువైపు?