Egg Recipes: How To Prepare Egg Chapati In Telugu, Step-by-Step Process Inside - Sakshi
Sakshi News home page

Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్‌ చపాతీ తయారీ ఇలా!

Published Sun, May 22 2022 2:04 PM | Last Updated on Sun, May 22 2022 3:57 PM

Recipes In Telugu: How To Make Egg Chapati - Sakshi

రొటీన్‌గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్‌ చపాతి సులువుగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు.

ఎగ్‌ చపాతి తయారీకి కావలసినవి:
►గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి)
►గుడ్లు – 4 లేదా 5
►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌(చిన్నగా కట్‌ చేసుకోవాలి)
►పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్‌(చిన్నగా కట్‌ చేసుకోవాలి)
►ఉప్పు –తగినంత
►పసుపు – చిటికెడు
►కారం – 1 టీ స్పూన్‌
►చిక్కటిపాలు – 1 టేబుల్‌ స్పూన్‌

ఎగ్‌ చపాతి తయారీ విధానం:
►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.
►తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి.
►అనంతరం రెండు స్టవ్‌లు ఆన్‌ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్‌ వేసుకోవాలి.
►ఇరువైపులా దోరగా కాలిన చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్‌పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్‌ చేసుకోవాలి. 

చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి!
చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్‌ బ్రెడ్‌ మంచూరియా తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement