కావలసినవి:
వేయించిన ఉల్లిపాయ తరుగు – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పాలు – కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, గులాబీ రేకులు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ – అరకప్పు, ఓట్స్ – పావు కప్పు, బాదం – ఆరు, పచ్చిశనగపప్పు – టీస్పూను, ఎర్ర కందిపప్పు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పెసరపప్పు – టీస్పూను, నువ్వులు – టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, లవంగాలు – టీస్పూను, మిరియాలు – టీస్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, యాలకులు – ఎనిమిది, షాజీరా – టేబుల్ స్పూను, తోకమిరియాలు – టీస్పూను, పెరుగు – అరకప్పు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, పుదీనా తరుగు – టేబుల్ స్పూను, సన్నగా తరిగిన జీడిపప్పు – 20 గ్రా., పిస్తా పలుకులు – 20 గ్రా., బాదం పలుకులు – 20 గ్రా., మీల్‌మేకర్ – 100 గ్రా., నిమ్మరసం – టీస్పూను.
తయారీ:
► ముందుగా మీల్‌మేకర్‌ను ఇరవై నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. నానాక బరకగా రుబ్బుకోవాలి.
► మిక్సీజార్‌లో.. తోక మిరియాలు, షాహజీరా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, పప్పులన్నీ, ఆరు బాదం పప్పులు, ఓట్స్, గోధుమ రవ్వ, నువ్వులు అన్నీ కలిపి పొడిచేయాలి.
► స్టవ్ మీద కుకర్ గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి.
►ఇవివేగాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బరకగా గ్రైండ్ చేసిన మీల్ మేకర్ మిశ్రమాన్ని కలపాలి.
►ఇప్పుడు పెరుగు, పాలు, గులాబి రేకులు, కొత్తిమీర, పుదీనా తరుగు, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి కలిపి, పొడిచేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలిపి, మూడు విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటమీద ఉడికించాలి.
►ఉడికిన మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు చూసి చూసి వేసుకుంటే వేడివేడి వెజ్ హలీమ్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment