కావలసినవి: మినప్పప్పు– కప్పు; జొన్న పిండి –3 కప్పులు ; అటుకులు– పావు కప్పు; మెంతులు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్; నూనె లేదా నెయ్యి – 4 టీ స్పూన్‌లు.
తయారీ:
మినప్పప్పు, మెంతులను కడిగి మంచినీటిలో ఐదారు గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వంపేసి మిక్సీలో వేసి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, అదే జార్‌లో జొన్న పిండి, నీరు వేసి బాగా కలవడం కోసం కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. దీనిని మినప్పప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి గట్టిగా మూత పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం పిండిని గరిటెతో కలిపి చూసుకుని తగినంత నీరు, ఉప్పు కలిపి దోసెలు వేసుకోవడమే.
ఈ దోసెలు వేరుశనగపప్పు చట్నీ లేదా కొబ్బరి– పచ్చి శనగపప్పు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ పేషెంట్‌లకు మంచి ఆహారం. (క్లిక్ చేయండి: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!)
Comments
Please login to add a commentAdd a comment