![One Rupee Oxygen Cylinder Refill In Hamirpur, Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/26/Manoj-Gupta-Oygen-Cylinder.jpg.webp?itok=_Vws1Ca1)
మనోజ్ గుప్తా ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్లు
లక్నో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో అందరూ ఆక్సిజన్ పంపండి అన్ని చాలా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ అందిస్తున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేయడానికి ఒక్క రూపాయి తీసుకుని ఏకంగా వెయ్యి సిలిండర్లను రీఫిల్ చేశారు.
ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్ గుప్తా రిమ్‌జిమ్ ఇస్పాత్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజలను ఆదుకునేందుకు మనోజ్ ముందుకు వచ్చాడు. ఆ కంపెనీ ఎండీ యోగేశ్ అగర్వాల్‌తో కలిసి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రూపాయి తీసుకుని ఆక్సిజన్ సిలిండర్లు నింపి ఇచ్చారు.
‘సాధారణంగా స్టీల్ పరిశ్రమలో ఆక్సిజన్ వినియోగిస్తాం.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆక్సిజన్ అందించాలని డిసైడ్ అయ్యా’ అని మనోజ్ గుప్తా తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వారికి ఉచితంగా ఇవ్వకుండా కేవలం ఒక్క రూపాయికే సిలిండర్ రీఫిల్ చేస్తున్నట్లు చెప్పారు. రూపాయికే ఆక్సిజన్ అందిస్తున్న విషయం తెలుసుకుని మనోజ్ గుప్తా వద్దకు అలీఘర్, నోయిడా, లక్నో, బనారస్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు.
చదవండి: మా రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టబోం
చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
Comments
Please login to add a commentAdd a comment