Hamirpur
-
Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్ సీట్లు
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. చివరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాల్లో ఐదు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ హాట్ సీట్లపై ఫోకస్... వారణాసి... మోదీ మేజిక్ కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో తొలిసారి ప్రధాని అభ్యరి్థగా ఇక్కడ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన ఆయన 2019లో మెజారిటీని 4.8 లక్షల ఓట్లకు పెంచుకున్నారు. ఈసారి దాన్ని రికార్డు స్థాయికి పెంచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ప్రధానిని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. రాయ్ ఒకప్పుడు బీజేపీ నేతే కావడం విశేషం. బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన వారణాసిలో 1991 నుంచి బీజేపీ పాతుకుపోయింది. 2004లో కాంగ్రెస్ గెలిచినా మళ్లీ 2009లో బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ విజయం సాధించారు.హమీర్పూర్.. అనురాగ్ విన్నింగ్ షాట్!ఇది బీజేపీ కంచుకోట. 1989 నుంచి ఏకంగా 10సార్లు కాషాయ జెండా ఎగిరింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆ విజయ పరంపరను ధుమాల్ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనసాగిస్తున్నారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన ఠాకూర్ 2019లో ఏకంగా 4 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అది ఆయనకు వరుసగా నాలుగో విజయం. కాంగ్రెస్ నుంచి సత్పాల్ రైజాదా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. వాటిలో 4 స్థానాలు హమీర్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.మండీ... కింగ్ వర్సెస్ క్వీన్ ఆరుసార్లు సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ రాజ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట. ఆయన, భార్య ప్రతిభా సింగ్ ఇద్దరూ ఇక్కడి నుంచి మూడేసిసార్లు గెలవడం విశేషం! 2014, 2019ల్లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ గెలిచి కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేశారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్ స్వల్ప మెజారిటీతో నెగ్గారు. ఈసారి బీజేపీ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ప్రతిభకు బదులు ఆమె కుమారుడు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆయన ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంగన, విక్రమాదిత్య పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. కంగనా నాన్ లోకల్ అని, వరదలప్పుడు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.డైమండ్ హార్బర్... అభిషేక్ హవా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 నుంచి తృణమూల్ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ వారసునిగా చెబుతున్న సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్‌కు బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ (బాబీ) గట్టి పోటీ నేపథ్యంలో ఈసారి విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అభిషేక్ హ్యాట్రిక్ కొడతారా, డైమండ్ హార్బర్‌పై కాషాయ జెండా ఎగురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సీపీఎం కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పటా్నసాహిబ్ పేరుతో 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానం. 2009, 2014ల్లో బీజేపీ నుంచి నెగ్గిన బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేశారు. దాంతో ఆయన్ను ఢీకొనేందుకు బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో శత్రుఘ్నపై భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అన్షుల్ అవిజిత్ నుంచి రవిశంకర్ ప్రసాద్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు. కాంగ్రెస్‌తో పాటు దాని భాగస్వామి ఆర్జేడీకి కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకుంది. దాంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కఠిన పరీక్షగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వైరల్ వీడియో..
లక్నో: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, ఈ వేడుకలలో ఏదో ఒక సంఘటనతో ఆ వివాహం కాస్త వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఈ పెళ్లి కూడా ఒక సంఘటనతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ వివాహం యూపీలోని హమీర్ పూర్ జిల్లాలో జరిగింది. కాగా, భరువా సుమేర్ పూర్ గ్రామానికి చెందిన ఉమేష్ చంద్ర, అదే గ్రామానికి చెందిన అంకితాలు ఒకర్నొకరు ఇష్టపడ్డారు. వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఉమేష్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే, ఈ పెళ్లికి ఇంట్లో వారు నిరాకరించారు. దీంతో ఉమేష్, అంకితలు ఇంట్లో నుంచి పారిపోయి రిజిస్ట్రర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు. వారు వేరే చోట ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులకి అంకిత తల్లిదండ్రులు తమ కూతురు, అల్లుడి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు, గ్రామస్థులందరిని ఆహ్వనించారు. కానీ.. ఉమేష్ కుటుంబం సభ్యులకు మాత్రం సమాచారం ఇవ్వలేదు. దీంతో వారు కోపంతో రగిలిపోయారు. అప్పుడు, ఉమేష్ తల్లి రిసెప్షన్ వేడుకలో ముసుగు వేసుకుని వెళ్లింది. ఆ సమయంలో అక్కడ వందల సంఖ్యలో అతిథులున్నారు. రిసెప్షన్ పార్టీలో భాగంగా జైమాల కార్యక్రమం జరుగుతుంది. దీనిలో వేదికపై వధువరులు కూర్చోవటానికి కమలం పువ్వులాంటి సింహసనాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది చుట్టుతిరుగుతూ ఉంటుంది. అందరు ఆ కార్యక్రమాన్ని ఫన్నీగా చూస్తున్నారు. అప్పుడు, ముసుగులో ఉన్న వరుని తల్లి ఆ వేదికపై ఎక్కి.. వరుడిని చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. ఈ అనుకొని సంఘటనతో.. పాపం.. దంపతులిద్దరు షాక్‌కు గురయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. అతిథులకు కూడా.. కాసేపు ఏంజరుగుతుందో అర్థం కాలేదు. కానీ, ఆ మహిళ, ముసుగు తీశాక అసలు సంగతి తెలిసింది. అయితే, ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియో చక్కర్లు కొడుతుంది. -
మరో హీరో: ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్
లక్నో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో అందరూ ఆక్సిజన్ పంపండి అన్ని చాలా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ అందిస్తున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేయడానికి ఒక్క రూపాయి తీసుకుని ఏకంగా వెయ్యి సిలిండర్లను రీఫిల్ చేశారు. ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్ గుప్తా రిమ్జిమ్ ఇస్పాత్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజలను ఆదుకునేందుకు మనోజ్ ముందుకు వచ్చాడు. ఆ కంపెనీ ఎండీ యోగేశ్ అగర్వాల్‌తో కలిసి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రూపాయి తీసుకుని ఆక్సిజన్ సిలిండర్లు నింపి ఇచ్చారు. ‘సాధారణంగా స్టీల్ పరిశ్రమలో ఆక్సిజన్ వినియోగిస్తాం.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆక్సిజన్ అందించాలని డిసైడ్ అయ్యా’ అని మనోజ్ గుప్తా తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వారికి ఉచితంగా ఇవ్వకుండా కేవలం ఒక్క రూపాయికే సిలిండర్ రీఫిల్ చేస్తున్నట్లు చెప్పారు. రూపాయికే ఆక్సిజన్ అందిస్తున్న విషయం తెలుసుకుని మనోజ్ గుప్తా వద్దకు అలీఘర్, నోయిడా, లక్నో, బనారస్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
సైకిల్‌పై భార్యతో కలిసి 230 కి.మీ ప్రయాణం
హమీర్పూర్ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాలు తప్పిస్తే వివాహ, ఇతరత్రా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అయితే కొందరు తమ వివాహాలను వాయిదా వేసుకోవడం ఇష్టం లేక ఎంతదూరమైనా వెళుతున్నారు. కొందరు తమ కుటుంబసభ్యులు సమక్షంలో జరుపుకుంటుంటుండగా, మరికొందరు ఆన్లైన్లో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన కల్కు ప్రజాపతి పెళ్లి కోసమని మొదట 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. పెళ్లి చేసుకొని తిరిగి అదే సైకిల్‌పై తన భార్యను ఎక్కించుకొని మరో 130 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మొత్తం 230 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఎట్టకేలకు తన సొంతూరుకు చేరుకున్నాడు. (ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్ చేసి..) వివరాలు.. హమీర్‌పూర్‌కు చెందిన కల్కు ప్రజాపతి పదో తరగతి వరకు చదువుకున్నాడు. మహోబా జిల్లా పునియా గ్రామానికి చెందిన వధువు రింకుతో పెళ్లి ఏప్రిల్ 25వ తేదీన జరగాల్సి ఉంది. తన పెళ్లికి సంబంధించి అనుమతి కోసం లోకల్ పోలీసులను ఆశ్రయించగా వారు నిరాకరించారు. దీంతో చేసేదేంలేక ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రజాపతి సైకిల్‌పై వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న సమయానికి పెళ్లి జరగడంతో ప్రస్తుతం ప్రజాపతి సంతోషంగా ఉన్నాడు. అయితే తన ప్రయాణంలో పడిన కష్టాలను స్వయంగా చెప్పుకొచ్చాడు. ' నా వివాహం నాలుగు నెలల క్రితమే రింకూ అనే వధువుతో నిశ్చయించారు. అయితే వధువు కుటుంబం 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోబా జిల్లా పునియా గ్రామంలో ఉంటున్నారు. అప్పటికే వధువు రింకూ కుటుంబం పెండ్లి పత్రికలు కూడా ముద్రించి అందరికి పంపిణీ చేశారు. ఇంతలో కరోనా వల్ల లాక్డౌన్ విధించారు. పెళ్లి కోసం నెలరోజులకు పైగా పొలం పనులు విడిచిపెట్టి అనుమతి కోసం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగాను. కాని నాకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. ఇంతలో పెండ్లి తేదీ దగ్గరకు వస్తుందనే ఆందోళన ఎక్కువైంది. దీనికి తోడు నాకోసం వధువు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సైకిల్‌పై బయలుదేరాను. వాస్తవానికి నాకు ద్విచక్రవాహనం నడపడం వచ్చు కాని లైసెన్స్ లేదు. సైకిల్‌పై వెళితే లైసెన్స్ అవసరం ఉండదని భావించి ప్రయాణం ప్రారంభించాను. చివరకు ఎన్నో కష్టాలు పడి వధువు ఇంటికి చేరుకున్నాను. (పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి) మా వివాహానికి అందరిని ఆహ్వానించాం. లాక్డౌన్ కారణంగా బంధువుల ఎవరూ మా పెళ్లికి రాలేకపోయారు. వధువు కుటుంబ సభ్యుల మధ్య గుడిలో వివాహ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నేను వెళ్లేటప్పుడు ఒంటరిగానే వెళ్లాను. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రింకూ కూడా ఉండటంతో సైకిల్ తొక్కడం ఇబ్బందిగా మారింది. దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కాళ్లు నొప్పులు పుట్టి నిద్రకూడా సరిగా పట్టలేదు.. నొప్పులు తగ్గడానికి మందులు వాడాల్సి వచ్చింది. బంధువులు వివాహానికి హాజరుకాలేక పోయినా అందరూ ఫోన్లు చేసి ఆశీర్వదించారు. పెండ్లి వాయిదా వేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కాని తన తల్లి ఆనారోగ్యంతో ఉండటం,ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల తప్పని సరిగా ఇప్పడే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాక లాక్డౌన్ ఎత్తివేయడానికి ఎంతసమయం పడుతుందో తెలియదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు' ప్రజాపతి చెప్పుకొచ్చాడు. -
వధువు కోసం 100 కి.మీ సైకిల్‌పై..
లక్నో: కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఇక్కడ చెప్పుకునే జంట విషయంలోనూ ఇదే జరిగింది. మా పెళ్లిని ఆపడం కరోనా తరం కూడా కాదంటూ శపథం చేసిందీ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ జంట. హమీర్‌పుర్‌లోని పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతికి మహోబా జిల్లాలోని పునియా గ్రామానికి చెందిన రింకీకి వివాహం నిశ్చయమైంది. ఇంతలో పెళ్లికి వీల్లేదంటూ లాక్డౌన్ వచ్చిపడింది. అలా అని చెప్పి వాళ్లు పెళ్లిని వాయిదా వేసుకోలేదు. ఒంటరిగానైనా సరే వివాహం జరగాల్సిందేనని భీష్మించుకున్నాడు. ఇంకేముందీ తన సైకిల్‌ను బయటకు తీశాడు. తను మనువాడే యువతి కోసం కలలు కంటూ ఏప్రిల్ 27న సైకిల్ తొక్కుతూ పయనం ప్రారంభించాడు. (కొత్త జంటకు కరోనా; గ్రామానికి సీల్) ఇలా జరుగుతుందనుకోలేదు వంద కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్లగా ఏప్రిల్ 28 నాటికి వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఇంకేముందీ.. అప్పటివరకు పడ్డ కష్టాన్ని మరిచి అక్కడే బాబా ధ్యానిదాస్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బుధవారం నాడు అదే సైకిల్‌పై కొత్త జంట వరుడి ఇంటికి చేరుకుంది. ఈ పెళ్లి గురించి కల్కు మాట్లాడుతూ.. "నా పెళ్లి కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ విధంగా జరుగుతుందనుకోలేదు" అని పేర్కొన్నాడు. (కరోనా: అప్పుడు మాకు దిక్కెవరు?) -
పలు అసెంబ్లీ నియోజకవార్గల్లో ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక కొనసాగుతుంది. చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, కేరళలోని పాల, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్, త్రిపురలోని బధర్‌ఘాట్ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను, వీవీపాట్లను ఎన్నికల కేంద్రాలకు చేర్చింది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతోంది. పండగలు, ఓట్ల నమోదు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసీ నేడు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నటు తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సెప్టెంబర్ 27న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించింది. బీజేపీ నాయకుడు బీమా మందావి నక్సల్స్ దాడిలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు చేరుకుని.. క్యూలైన్లో నిల్చున్నారు. పాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేరళ కాంగ్రెస్ మని వ్యవస్థాపకుడు కేఎం మని ఏప్రిల్‌లో మరణించారు. దాంతో ఈసీ సోమవారం ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. యూపీ బధర్‌ఘాట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దిలిప్ సర్కార్ మరణించడంతో ఇక్కడ నేడు ఉప ఎన్నిక జరుగుతుంది. హమీర్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ చందేల్ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో ప్రభుత్వం అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దాంతో ప్రస్తుతం హమీర్‌పూర్‌లో ఉప ఎన్నక జరగుతుంది. -
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
-
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్ పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు చెప్పుతో కొట్టారంటూ... ఫేస్బుక్లో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొట్టింది. 32 సెకన్ల నిడివి గల దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో 5000 సార్లకు పైగా షేర్ కూడా అయింది. మధ్యప్రదేశ్‌లోని కైలారస్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర శుక్లా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్యే కాకుండా.. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు ఈ చెప్పు దెబ్బలు తిన్నారు. వీడియోలో ఒక మహిళా.. సన్మాన కార్యక్రమంలో ఓ వ్యక్తికి దండ వేస్తూ ఉండగా... మరో మహిళ తన చెప్పు తీసుకొని అతన్ని కొడుతూ ఉంటుంది. ఈ వీడియోలో వెనుక కనిపిస్తున్న పోస్టర్లో ‘హిమాచల్ పరివాహన్ మజ్దూర్ సంఘ్’ అని ఉంది. అయితే హమీర్ పూర్‌కు చెందిన సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నరిందర్ థాకూర్‌ను సంప్రదించగా.. తనకు అలాంటి అవమానకర సంఘటన ఎదురు కాలేదని చెప్పారు. కానీ హమీర్ పూర్లో ఆ సంఘటన జరిగిందన్నారు. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడిపై ఈ దాడి జరిగిందని, మహిళలు కొట్టింది తనని కాదని చెప్పేశారు. 2018 జూలై 22న ఇద్దరు ట్రైనీ మహిళా కండక్టర్లు అతనిపై ఈ దాడికి పాల్పడట్టు తెలిసింది. ఆ తర్వాత వారిద్దర్ని వారి వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్టు కూడా రిపోర్టుల వచ్చాయి. ఇదే విషయాన్ని హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు శంకర్ సింగ్ కూడా ధృవీకరించారు. 2018 జూన్ 22న కొంతమంది మహిళలు తనపై దాడి చేశారని, సన్మాన కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు మహిళా కండక్టర్లు తనను ఈ విధంగా చెప్పుతో కొట్టారని చెప్పారు. వారికి కార్పొరేషన్లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ సంఘటనకు పాల్పడ్డారని తెలిపారు. అయితే మీకు బీజేపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు, తాను ఓ ఆర్ఎస్ఎస్ వర్కర్‌ను అని, తనకు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే ఫేస్బుక్లో షేర్ అవుతున్నట్టు బీజేపీ హమీర్పూర్ ఎమ్మెల్యేపై ఆ ఈవెంట్లో ఎలాంటి దాడి జరగలేదని, ఈ అవమానకర సంఘటనను హిమాచల్ రోడ్డు రహదారుల కార్పొరేషన్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ శంకర్ సింగ్ ఈ దాడికి గురయ్యారని చెప్పారు. -
యూపీలోనూ ‘పడవ’ విషాదం
హమీర్పూర్: బిహార్ రాజధాని పట్నాలో గంగానదిలో పడవ మునిగి 24 మంది చనిపోయిన కొద్ది గంటలకే పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. హమీపూర్ జిల్లా కేంద్రంలోని విర్మా నదిలో పడవ మునిగి ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలుకాగా, ఒకరు మహిళ. ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. -
'హిమాచలీ రంజా' ఖరీదు రూ.5 కోట్లు!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ రైతు .. దున్నపోతును వేలానికి పెట్టాడు. సాధారణంగా గేదలు, దున్నలను మామూలుగా బేరానికి పెడుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఏదైనా చేయాలని భావించిన రైతు నరేష్ సోని(44) వినూత్న పద్ధతిని ఎన్నుకున్నాడు. సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వేలం పెట్టాడు. దున్నపోతు వివరాలను అందుబాటులో ఉంచుతూ.. వేలం తేదీ తదితరాలను ఫేస్ బుక్ ద్వారా నలుగురికి పంచుతున్నాడు. రైతు ఉంచిన వివరాల ప్రకారం దున్నపోతు పేరు 'హిమాచలీ రంజా' దీని ప్రస్తుత వయసు 30 నెలలు. దాదాపు 1000 కేజీల బరువు, 13 అడుగుల పొడవు, 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు కలిగిన దున్నపోతు ధర రూ.5 కోట్లుగా తెలిపాడు. కాగా, ఈ శుక్రవారం హమీర్ పూర్ జిల్లాలోని ఘోరి ధవిరి పంచాయతీ పరిధిలో స్థానిక రాజకీయనాయకుల ఆధ్వర్యంలో దున్నపోతును వేలం వేయనున్నట్లు పేర్కొన్నాడు. హర్యానాలోని కురుక్షేత్రాకు చెందిన 'యువరాజ్' రూ.9 కోట్లు ధర పలికినపుడు, హిమాచలీ రంజా కచ్చితంగా రూ.5 కోట్లు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, దున్నపోతుల నుంచి సేకరించిన మేలిమి వీర్యకణాల అమ్మకం ద్వారా ఉత్తర భారతదేశంలో చాలా మంది రైతులు లాభాలను ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించేందుకే సోషల్ మీడియాలో అమ్మకం వివరాలను ఉంచినట్లు సోని తెలిపాడు. రోజుకు రూ.1,500ల రూపాయల రంజాకు ఖర్చవుతున్నట్లు పేర్కొన్నాడు. వేలానికి బిలాస్ పూర్ ఎమ్మెల్యే బామ్ బెర్ ఠాకూర్, తదితరులను ఆహ్వానించినట్లు తెలిపాడు. కాగా అంత ధర పలుకుతున్న దున్నపోతును చూడటానికి తాను కచ్చితంగా వస్తానని ఠాకూర్ చెప్పినట్లు పేర్కొన్నారు. 'హిమాచలీ రంజా' రోజూవారీ డైట్ వివరాలు సోయా బీన్- 2.5 కేజీలు చనా- 2.5 కేజీలు పశుగ్రాసం- 10 కేజీలు దేశీయ నెయ్యి- 1 కేజీ ఆపిల్ పళ్లు మసాజ్ కోసం 2 కేజీల నూనె -
మరో సారి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘనకు మరోసారి పాల్పడింది. జమ్మూ ప్రాంతంలోని సాంబ జిల్లాలోని బీఎస్ఎఫ్ దళాలకు చెందిన మంగు చాక్, కాద్వా చెక్ పోస్ట్‌లపై ఈ రోజు ఉదయం నుంచి కాల్పులకు తెగబడిందని సీనియర్ పోలీసు ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. అయితే భారత్ సైన్యం వెంటనే స్పందించిందన్నారు. కాగా ఇరువైపులా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. పాక్ సైన్యం నిన్న ఒక్క రోజే హమీర్పూర్ ప్రాంతంలో మూడు సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన సంగతిని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మరణించిన సంగతి విదితమే. గత వారం రోజుల కాలవ్యవధిలో పాక్ సైన్యం తొమ్మిది సార్లు భారత్ సరిహద్దు పై కాల్పులకు తెగబడిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.