
సాక్షి, ముంబై: వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్.. రూపాయికే లీటర్ పెట్రోల్ అని 500 మందికి పెట్రోల్ఇచ్చారు. దీంతో ఆఫర్ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
सोलापुरात डॉ. बाबासाहेब आंबेडकर जयंती निमित्त फक्त 1 रुपयात 1 लीटर पेट्रोल
— Maharashtra Today (@mtnews_official) April 14, 2022
यावर तुमची प्रतिक्रिया कमेंट्स करून सांगा#maharashtratoday #solapur #AmbedkarJayanti #AmbedkarJayanti2022 pic.twitter.com/Bhhg4VxsP3
ఈ సందర్భంగా బంక్ యజమాని మాట్లాడుతూ.. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. కాగా, 500 మందికే పెట్రోల్ ఇవ్వడంతో మిగిలిన వారంతా ఉసురూమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.