Liter petrol
-
బంపర్ ఆఫర్: రూపాయికే లీటర్ పెట్రోల్
సాక్షి, ముంబై: వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్.. రూపాయికే లీటర్ పెట్రోల్ అని 500 మందికి పెట్రోల్ఇచ్చారు. దీంతో ఆఫర్ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. सोलापुरात डॉ. बाबासाहेब आंबेडकर जयंती निमित्त फक्त 1 रुपयात 1 लीटर पेट्रोल यावर तुमची प्रतिक्रिया कमेंट्स करून सांगा#maharashtratoday #solapur #AmbedkarJayanti #AmbedkarJayanti2022 pic.twitter.com/Bhhg4VxsP3 — Maharashtra Today (@mtnews_official) April 14, 2022 ఈ సందర్భంగా బంక్ యజమాని మాట్లాడుతూ.. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. కాగా, 500 మందికే పెట్రోల్ ఇవ్వడంతో మిగిలిన వారంతా ఉసురూమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పెట్రోల్ ధర 36 పైసలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోలు ధర స్వల్పంగా పెరిగింది. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు పెరగగా.. లీటర్ డీజిల్‌పై 7 పైసలు తగ్గింది. తాజా పెంపుతో పెట్రోలు రేటు లీటరుకు రూ. 64.57(ఢిల్లీ ధర) కాగా, తాజా తగ్గింపుతో డీజిల్ ధర లీటర్‌కు రూ. 52.52(ఢిల్లీ ధర)కి చేరింది. తాజా ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. -
పెట్రోల్‌పై రూ.1.51 తగ్గింపు డీజిల్‌పై 50 పైసల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటర్‌పై రూ.1.51 పైసలు తగ్గింది. అయితే డీజిల్ ధర ఎప్పట్లాగే లీటరుకు 50 పైసలు పెరిగింది. సవరించిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ధరపై స్థానిక పన్నుల్లో తగ్గింపు, డీజిల్ ధరపై పెంపు కలుపుకుంటే ప్రాంతాలను బట్టి ధరలు మారతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు తగ్గడంతో పెట్రోల్‌పై రూ.1.51 తగ్గించామని, స్థానిక అమ్మకం పన్నుల్లో తగ్గింపునూ కలుపుకుంటే ఢిల్లీలో తగ్గింపు రూ.1.82కి చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 70.33 నుంచి రూ. 68.51కి చేరింది. పెట్రోధర ఈ నెలలో కిందకి దిగడం ఇది మూడోసారి. ఈ నెల 1న రూ.1.09, 15న రూ.2.18(స్థానిక పన్నుల్లో తగ్గింపు కలుపుకుని) తగ్గడం తెలిసిందే. పెట్రో ధర గత ఏడాది జూన్ ధరతో(రూ. 68.58)పోలిస్తే అతి తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, అంతర్జాతీయ ధరల తగ్గింపుతో 14.2 కేజీల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గి, రూ. 920 నుంచి రూ. 901కి చేరింది. బల్క్ డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.1.32 తగ్గింది. హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.76.84 నుంచి రూ.75.02కి తగ్గగా, డీజిల్ ధర రూ.63.65 నుంచి రూ. 64.26కు పెరిగింది.