రూపాయి నోటు మళ్లీ వస్తోంది..
రూపాయి నోటు చూసి ఎన్నేళ్లయ్యుంటుంది.. దశాబ్దం ముందు చూసుంటారు! రూపాయి నాణేలు వాడుకలోకి రావడంతో ఈ నోటు కనుమరుగైంది. కాగా రూపాయి నోటు సరికొత్తగా మరోసారి రాబోతోంది. 20 ఏళ్ల తర్వాత రూపాయి నోటును ముద్రించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రిత్వ వర్గాల సమాచారం.
నోటుపై వాడే ఇండిగో రంగు బదులు.. గులాబీ, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో రూపాయి నోటును ముద్రించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నోటుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేయనున్నారు. కాగా మిగిలిన నోట్లపై యాధాతథంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం చేస్తారు. రూపాయి నోటుపై 'భారత్ సర్కార్', 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' పేర్లను ముద్రిస్తారు. అలాగే దేశంలోని 15 భాషల్లో రూపాయి విలువను నోటుపై మద్రించనున్నారు.