రూపాయకే నల్లా కనెక్షన్ | manne kavitha gives nalla connection for one rupee | Sakshi
Sakshi News home page

రూపాయకే నల్లా కనెక్షన్

Published Wed, Nov 9 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

manne kavitha gives nalla connection for one rupee

బంజారాహిల్స్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో సింగాడికుంట నాయుడునగర్‌లో రూపాయికే నల్లా కనెక్షన్‌ను బుధవారం వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవిత పంపిణీ చేశారు. ఇటీవల దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ బస్తీవాసులు దరఖాస్తులు చేసుకున్నారు.

వీరి స్థితిగతులు పరిశీలించిన వాటర్‌వర్క్స్ అధికారులు 30 మందికి లబ్ధి చేకూరే విధంగా కనెక్షన్లను రూపాయికే మంజూరు చేశారు. ఈ పత్రాలను అందజేసిన అనంతరం కవిత మాట్లాడుతూ.. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement