Nalla Connection
-
పేదింటికి నల్లా
►1,476 బస్తీల్లో అమలకు జలమండలి నిర్ణయం ►రూ.100 కోట్ల నిధులతో ఏర్పాట్లు ►రూ.1కే 50వేల నల్లా కనెక్షన్ల మంజూరు ►వందరోజుల ప్రణాళిక సిద్ధం ►ఇక పేదల తాగునీటి ఎదురుచూపులకు చెక్! ►తగ్గనున్న ట్యాంకర్ల నిర్వహణ వ్యయం ►పెరగనున్న జలమండలి ఆదాయం సిటీబ్యూరో: మహానగరం పరిధిలోని ఎంపికచేసిన 1,476 మురికివాడల్లో వందరోజుల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటే లక్ష్యంగా జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుపేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.100 కోట్లను వెచ్చించనుంది. ఆయా బస్తీలు, మురికివాడల్లో ఇప్పటివరకు నల్లా కనెక్షన్ లేని ఆవాసాలకు రూ.1కే ఇవ్వాలని, నూతనంగా 50 వేల నల్లా కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా సుమారు 5 లక్షల మంది పేదలకు మేలు చేకూర్చాలని నిర్ణయించింది. ఈ అంశంపై గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధానంగా మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటులేని, కలుషిత జలాలతో ఇబ్బంది పడుతున్న.. తక్కువ వత్తిడితో నీటిసరఫరా జరుగుతున్న ప్రాంతాలను తక్షణం సెక్షన్ల వారీగా గుర్తించాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు చేయాల్సిన పైపులైన్లు, బూస్టర్ పంప్‌లు, కలుషిత జలాల నివారణకు చేపట్టాల్సిన పనులపై అంచనాలు సిద్ధంచేసి పనులు ప్రారంభించాలన్నారు. బస్తీలకు తీరనున్న దాహార్తి.. నగర శివార్లలోని 12 శివారు మున్సిపల్ సర్కిళ్లను కలుపుకొని 2007లో మహానగర పాలకసంస్థ (జీహెచ్ఎంసీ) ఏర్పాటైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీలో 1476 మురికివాడలున్నాయి. వీటిలో చాలా నివాసాలకు ఇప్పటికీ నల్లా కనెక్షన్లు లేవు. దీంతో పబ్లిక్ నల్లాలు, ట్యాంకర్ల ద్వారానే ఇక్కడి పేదలు గొంతు తడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హడ్కో నిధులు రూ.1900 కోట్లతో జలమండలి ఆయా ప్రాంతాల్లో 1300 కి.మీ. పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరో 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ పైపులైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో సమీప భవిష్యత్‌లో ఆయాబస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లకు రోజూ నీటిసరఫరా చేస్తారు. ఇదే జరిగితే ఆయా బస్తీలకు ట్యాంకర్ నీళ్లకోసం ఎదురు చూసే పరిస్థితి తప్పుతుంది. సీఎం సంకల్పాన్ని సాకారం చేస్తాం జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా బస్తీల్లో ఇంటింటికీ నల్లా లేదు. చాలా ప్రాంతాలకు ట్యాంకర్ నీరే దాహార్తిని తీరుస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. గ్రేటర్ పరిధిలో ప్రతి బస్తీలో ఇంటింటికి నల్లాల ఏర్పాటు ద్వారా సీఎం కలను సాకారం చేస్తాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే బస్తీల్లో పైపులైన్లు విస్తరించడానికి తక్షణం ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించాం. కొత్తగా నీటిని సరఫరా చేయాల్సిన ప్రాంతాల తుది జాబితాను సిద్దం చేయాలని సూచించాం. – ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ -
వడివడిగా భగీరథ
► డిసెంబర్ నాటికి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ► నల్లా కనెక్షన్‌కు రూ.40,854 లక్షలు కేటాయింపు ► తీరనున్న 22 మండలాల ప్రజల దాహార్తి ‘మిషన్ భగీరథ’ వడివడిగా సాగుతోంది. డిసెంబర్ నాటికి ‘ఇంటింటికీ నల్లా’ కనెక్షన్ జారీ చేసే దిశగా పనులు వేగం అందుకున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ప్యాకేజీల ఖరారులో కొంతమేర జాప్యం జరిగినా.. ఈ నెలాఖరులోపు వాటిని కొలిక్కి తేవడం ద్వారా నిర్ణీత వ్యవధిలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రజల ముంగిటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన సర్కారు... ఇంటర్నెట్ వినియోగించేందుకు వీలుగా అన్ని ఇళ్లకు లైన్ వేయనుంది. నల్లాల కనెక్షన్ కోసం తవ్వే భూగర్భ పైప్లైన్లోనే ఇంటర్నెట్ ఓఎస్పీ కేబుల్ వేయనుంది. మిషన్ భగీరథ కింద జిల్లాలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు రూ.40,854.27 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో 22 మండలాల(రెవెన్యూ) ప్రజల దాహార్తి తీర్చనుంది. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ సర్కారు వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు సంబంధం లేకుండా... ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ జారీ చేసేలా భగీరథను రూపొందించింది. ఈ మేరకు జిల్లాలోని 1,056 ఆవాసాలకు నీటిని సరఫరా చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. వాయువేగంతో పైప్లైన్లను వేస్తోంది. మిషన్ భగీరథ పనులను 33 ప్యాకేజీలుగా విభజించిన పంచాయతీరాజ్‌శాఖ.. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలాప్రణాళికను అమలు చేస్తోంది. 2.19 క్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ జిల్లాలోని ఆరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,056 ఆవాసాలలోని సుమారు పది లక్షల జనాభా నివాసముంటున్న 2,19,211 గృహాలకు నల్లా కనెక్షన్ జారీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 853 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులతో 2,093.54 కి.మీ.మేర పైప్లైన్ల ద్వారా వీటికి నీటి సరఫరా చేయాలని ప్రతిపాదించింది. అయితే, జిల్లావ్యాప్తంగా నిర్మించతలపెట్టిన 853 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల్లో 50శాతం వాటికీ ఇంకా టెండర్లు ఖరారు కాకపోవడం అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తోంది. ఇంకా ఖరారు కానీ టెండర్లను ఈ వారంలోపు పూర్తి చేయకపోతే గడువులోగా భగీరథను పూర్తి చేయడం సాధ్యంకాదని యంత్రాంగం అంటోంది. ఈ నేపథ్యంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణ పనులను మూడు కేటగిరీలుగా విభజించింది. జూన్‌లోపు కొన్ని, సెప్టెంబర్ ఇంకొన్ని, డిసెంబర్లో మరికొన్నింటిని పూర్తి చేయాలని నిర్దేశించింది. -
రూపాయకే నల్లా కనెక్షన్
బంజారాహిల్స్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో సింగాడికుంట నాయుడునగర్‌లో రూపాయికే నల్లా కనెక్షన్‌ను బుధవారం వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవిత పంపిణీ చేశారు. ఇటీవల దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ బస్తీవాసులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరి స్థితిగతులు పరిశీలించిన వాటర్‌వర్క్స్ అధికారులు 30 మందికి లబ్ధి చేకూరే విధంగా కనెక్షన్లను రూపాయికే మంజూరు చేశారు. ఈ పత్రాలను అందజేసిన అనంతరం కవిత మాట్లాడుతూ.. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. -
‘గ్రేటర్ మిషన్’కు మోక్షం
శివార్లకు మంచినీటి భాగ్యం మిషన్ భగీరథకు జీహెచ్ఎంసీ అనుమతులు 2700 కి.మీ పైప్‌లైన్ పనుల కోసం రోడ్కటింగ్కు ఓకే 2017 మే నాటికి పనుల పూర్తికి చర్యలు సిటీబ్యూరో: మహా నగరంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు ఉద్దేశించిన గ్రేటర్ మిషన్ భగీరథ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 2700 కి.మీ మేర మంచినీటి సరఫరా పైప్లైన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ రహదారుల కోత(రోడ్ కటింగ్)కు అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం రెండు విభాగాల ఉన్నతాధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్‌లు సమావేశం నిర్వహించి ఈ పనుల పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇందులో 2000 కి.మీ మార్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను జలమండలి సొంత నిధులతో పూర్తిచేయనుంది. మరో 700 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్న భారీ మైల్డ్‌స్టీల్ పైపులైన్ల కారణంగా దెబ్బతినే రహదారుల పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీకి జలమండలి చెల్లించనుంది. పైప్‌లైన్ పనులు పూర్తరుున వెంటనే రహదారుల మరమ్మతులు పూర్తిచేయాలని ఈ సమావేశంలో నిర్ణరుుంచారు. కాగా 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో ఏర్పాటు చేయాల్సిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులకు ఏడాది తర్వాత అనుమతులు లభించడం విశేషం. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను వచ్చే ఏడాది మే నాటికి దశలవారీగా పూర్తిచేసి 250 మిలియన్ లీటర్ల తాగు నీటిని వీటిల్లో నింపనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపారుు. వచ్చే ఏడాది మే నాటికి గ్రేటర్ మిషన్ భగీరథ పథకం పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఈ పథకం పూర్తితో శివార్లలో సుమారు 35 లక్షలమంది దాహార్తి తీరనుందని పేర్కొన్నారు. గ్రేటర్ మిషన్ భగీరథ పనుల పూర్తి ఇలా... రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం {పాంతాన్ని బట్టి ఒక మిలియన్ లీటర్ సామర్థ్యం నుంచి 22.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం వరకు స్టోరేజి రిజర్వాయర్లున్నారుు. కౌకూర్, జొన్నబండ రిజర్వాయర్లు మినహా 54 స్టోరేజి రిజర్వాయర్ల పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. వీటిలో 10 రిజర్వాయర్లను జనవరి, 2017, మరో పదింటిని ఫిబ్రవరి, మరో పదింటిని మార్చి, మరో పదింటిని ఏప్రిల్, మిగిలిన వాటిని మే 2017 నాటికి పూర్తిచేయనున్నారు. అన్ని స్టోరేజి రిజర్వాయర్లకు నీటిని నింపే ఇన్లెట్ పైపులైన్ల ఏర్పాటు పనులను డిసెంబరు నాటికి పూర్తిచేయనున్నారు. స్టోరేజి రిజర్వాయర్ల నుంచి సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలకు మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన పంపిణీ పైప్లైన్లను మే 2017 నాటికి ఏర్పాటుచేయనున్నారు. మంచినీటి సరఫరాకు 100 డయా వ్యాసార్థం గల డకై ్టల్ ఐరన్పైపులు..స్టోరేజి రిజర్వాయర్లలో నీటిని నింపేందుకు 1300 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌స్టీల్ పైప్లైన్లను ఏర్పాటు చేయనున్నారు. పనుల పూర్తి అనంతరం గ్రేటర్ (625 చ.కి.మీ)పరిధిలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయనున్నారు -
నల్లా సరే..నీళ్లేవి?
రూ.1కే నల్లా కనెక్షన్ ఇచ్చినా... డిమాండ్‌కు సరిపడా నీటి సరఫరాపై అనుమానాలు! సిటీబ్యూరో: రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గత నెలలో జారీచేసినఉత్తర్వులకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నల్లా కనెక్షన్లు మంజూరు చేసేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా....అసలు నల్లా కనెక్షన్లు తీసుకున్న ఇళ్లకు నీళ్లు ఎలా సరఫరా చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. గ్రేటర్ జనాభాకు అనుగుణమైన నీటి సరఫరా వ్యవస్థ ప్రస్తుతం లేదు. దీంతో అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా కష్టమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ సుమారు వెయ్యి కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన పైపులైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేవు. హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్లతో ఇటీవల చేపట్టిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులను ఏడాదిలో యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే నిరుపేదల దాహార్తి తీరనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మార్గదర్శకాల తయారీలో నిమగ్నం.. పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షల లోపుగా ఉన్నవారిని బీపీఎల్ కుటుంబాలుగా పరిగణిస్తారు. కనెక్షన్ పొందాలనుకునేవారు విధిగా ఆదాయ సర్టిఫికెట్ ను దరఖాస్తు ఫారంతోపాటు జత చేయాల్సి ఉంటుందని, ఇతరత్రా నిబంధనలను సైతం మార్గదర్శకాల్లో పొందుపరచి క్షేత్రస్థాయిలోని జనరల్ మేనేజర్ కార్యాలయాలకు త్వరలో పంపి్తున్నట్లు వాటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా మహానగరం పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లా కనెక్షన్లుండగా..సుమారు 13 లక్షల నిరుపేద కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. కానీ నగరంలో జలమండలి మంచినీటిని సరఫరా వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దశలవారీగా రూ.1కే నల్లా కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నాయి. డిమాండ్..సరఫరా మధ్య అంతరం తీరేదెలా? మహానగరం జనాభా కోటికి చేరువైంది. కానీ మొన్నటివరకు రాజధాని దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా(మెదక్), హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ప్రస్తుతం కృష్ణా మూడు దశల ద్వారా 270, గోదావరి మొదటిదశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని నగరానికి అత్యవసర పంపింగ్ ద్వారా తరలించి 8.75 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. కానీ నీటి డిమాండ్ 542 మిలియన్ గ్యాలన్లుగా ఉండడం గమనార్హం. అంటే ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటికి..డిమాండ్ మధ్య అంతరం 186 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. ఇక భవిష్యత్‌లో నల్లా కనెక్షన్ల సంఖ్య మరో 13 లక్షలు పెరిగితే నీటి డిమాండ్ వెయ్యి మిలియన్ గ్యాలన్లకు చేరుకోవడం తథ్యం. ఈనేపథ్యంలో ఈ స్థాయిలో నీటిని ఎక్కడినుంచి తరలిస్తారన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ శివార్లలో శామీర్‌పేట్(గోదావరి జలాలు), మల్కాపూర్(కృష్ణా జలాలు)లలో యుద్ధ ప్రాతిపదికన రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించి 40 టీఎంసీల నీటిని సీజన్లో నిల్వచేస్తేనే గ్రేటర్ దాహార్తి సమూలంగా తీరుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గతంలో రూ.200.. నేడు రూ.1 గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రూ.200కే కనెక్షన్ మంజూరు చేసేవారు. సర్కారు తాజా ఉత్తర్వులతో ఒక్కో కుటుంబానికి రూ.199 ఆదా కానుంది. కాగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీల్లో మంచినీటిసరఫరా వ్యవస్థ, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం హడ్కో సంస్థ జారీచేసిన రూ.1900 కోట్ల నిధులతో ఆయా ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను విస్తరిస్తున్నారు. ఈనేపథ్యంలో మరో ఏడాదిలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పదిలక్షల పేద కుటుంబాలకు రూ.1 కే నల్లా కనెక్షన్లు ఏర్పాటు కానున్నాయని జలమండలి వర్గాలు తెలిపాయి.అయితే రూ.1కే కనెక్షన్ ఇచ్చినా..నెలకు ఒక్కో కుటుంబానికి సరఫరా చేయనున్న 15 వేల లీటర్ల నీటికి రూ.150 నీటిబిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశాయి. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాలకు తక్షణం కనెక్షన్ ఇస్తామని తెలిపాయి. -
ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్
రూ.2 లక్షల ఆదాయం లోపు వారికి అవకాశం నగర పంచాయతీ పరిధిలో అమలు పరకాల : ఇప్పటికే ఇంటింటికి తాగునీటికి అందించడానికి మిషన్ భగీరథను ప్రారంభించగా నగర పంచాయతీ పరిధిలో ప్రతి గడపకు నల్లా నీళ్లు అందించడానికి ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వడానికి ఆదేశాలను జారీ చేసింది. నగర పంచాయతిలో 4081 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగర పంచాయతీలో దారిద్రరేఖకు దిగువనున్న వారికి రూ. 1కే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలను జారీ చేశారు. దీని కోసం అధికారులు కసరత్తును చేస్తున్నారు. నగర పంచాయతీలో సొంత ఇళ్లును కలిగి ఉండి రూ. 2 లక్షల ఆదాయం లోపు ఉన్న వారిని అర్హులుగా ప్రకటించారు. తహసీల్దార్ నుంచి ధ్రువీకరించిన ఆదాయం (మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికెట్)ను పంచాయతీ కార్యాలయంలో సమర్పిస్తే తక్షణమే నల్లా క నెక్షన్ ఇచ్చేందుకు అధికారులు బిల్ కలెక్టర్లకు సూచించారు. అర్హులైన వారికి నల్లా కనెక్షన్ విషయంలో అవగాహన కల్పించి కనెక్షన్ తీసుకునేలా ప్రయత్నించాలని కమిషనర్ పరమేష్ సిబ్బందికి చెప్పారు. గతంలో రూ.200 ఉండగా ఇప్పుడు రూపాయికే కనెక్షన్ ఇస్తున్నారు. రూపాయికే కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. -
రూపాయి కొట్టు.. నల్లా పట్టు
♦ సిద్దిపేటలో రేపటి నుంచే కనెక్షన్లు ♦ నేటి నుంచి వార్డుల్లో మేళాలు ♦ 7 వేల నూతన కనెక్షన్ల లక్ష్యం ♦ 1,670 అక్రమ నల్లాల గుర్తింపు ♦ క్రమబద్ధీకరణకు చర్యలు సిద్దిపేట జోన్: మున్సిపాలిటీలో రూపాయికే నల్లా కనెక్షన్.. బుధవారం నుంచే అమలు.. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం.. సిద్దిపేట మున్సిపల్ అధికారులు మంగళవారం నుంచి వార్డుల్లో దరఖాస్తులను స్వీకరించేందుకు మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి ప్రణాళిక బద్ధంగా వార్డు సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా పట్టణంలోని ఆయా వార్డుల్లో 1,670 అక్రమ నల్లాలున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా విలీన గ్రామాల్లో అక్రమ నల్లాలు అధికంగా ఉన్నట్లు సర్వేలో తెలింది. ప్రభుత్వం రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో మిషన్ భగీరథకు అనుసంధానంగా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేటలోని మున్సిపల్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం 13 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆరు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో 1670 నల్లా కనెక్షన్లు రికార్డుల్లో లేనట్లుగా సర్వేలో తెలింది. ప్రభుత్వ ఆశయం మేరకు రూపాయికే బడుగు బలహీన వర్గాలకు నల్లా కనెక్షన్ అందించేలా సిద్దిపేట అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్రమమైన వాటిని క్రమబద్దీకరిస్తూ మరో 7 వేల నూతన నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. క్రమబద్ధీకరణకు మార్గం సిద్దిపేట పట్టణంతో పాటు ఆరు విలీన గ్రామాల్లో కొన్నేళ్లుగా రికార్డులకు ఎక్కని నల్లాలను క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమం చేశారు. ప్రతి నెలకు 150 చొప్పున యేడాది పొడవునా 12 నెలలకు కలిపి రూ. 1800 చెల్లిస్తే అక్రమ నల్లాను క్రమబద్ధీకరించే అవకాశముంది. అందుకు మంగళవారం నుంచి జూన్ 5 వరకు పట్టణంలోని 34 వార్డుల్లో సభ లు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏఈ, ఆర్ఐ, లైన్మెన్, బిల్ కలెక్టర్లతో కూడిన కమిటీ రోజూ ఉదయం 8 గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు చొప్పున మూడు వార్డుల్లో మేళాలు నిర్వహించనుంది. ఈ సభల్లో అక్రమ నల్లా క్రమబద్ధీకరణతోపాటు, రూపాయికే నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు, భగీరథ కింద ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన నూతన పైపులైన్ నిర్మాణం ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. ప్రతి ఇంటికి ఒకే నల్లా ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక ఇంట్లో రెండు ఉంటే ఒకటి తొలగించనున్నారు. -
కనెక్షన్లో కాసుల వేట
గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది నిర్వాకం చేయి తడపకుంటే చుక్కలే.. రూ.25 వేల వరకు అక్రమ వసూళ్లు నిఘా పెట్టాలని వినియోగదారుల విజ్ఞప్తి సిటీబ్యూరో: సురేష్ ఆసిఫ్‌నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే నూతన నల్లా కనెక్షన్ పొందేందుకు ఆన్లైన్లో జలమండలికి దరఖాస్తు చేసుకున్నాడు. తన ఇంటి విస్తీర్ణాన్ని బట్టి కనెక్షన్ చార్జీలు సైతం చెల్లించాడు. దీంతో బోర్డు అధికారులు అతనికి నల్లా కనెక్షన్ మంజూరు చేశారు. కానీ కనెక్షన్ ఇచ్చే గ్రీన్ బ్రిగేడ్ సిబ్బంది మాత్రం రూ.5 వేలు ఇవ్వకుంటే కనెక్షన్ వేసేది లేదని చెప్పడంతో సురేష్ విస్తుబోయాడు. దరఖాస్తుతో పాటే తాను కనెక్షన్ చార్జీలు చెల్లించినట్లు చెప్పినా వారు వినలేదు. చేసేదిలేక వారి చేతిలో డబ్బు పెట్టి కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది సురేష్ ఒక్కరి సమస్య మాత్రమే కాదు.. కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకుంటున్న ప్రతి వినియోగదారుడిదీ. జలమండలి పరిధిలో నెలకు సుమారు మూడువేల మందికి నూతన నల్లా కనెక్షన్లు మంజూరు అవుతున్నాయి. ఇక్కడి దాకా బాగానే ఉన్నా కనెక్షన్ ఇచ్చే సిబ్బంది కనెక్షన్ బిగించే సమయంలో వియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి రూ.5 వేలు నుంచి రూ.25 వేల వరకు పిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దొరికినంత దోచుకో.. నల్లా కనెక్షన్ల జారీలో కాసుల వేటతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. జలమండలి గ్రీన్‌బ్రిగేడ్ సి బ్బంది చేస్తున్న నిర్వాకాలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఇంటి నిర్మాణ స్థలం, అంతస్తులు, పోర్షన్ల సంఖ్యను బట్టి బోర్డు నిర్దేశించిన మేరకు చార్జీలు చెల్లిస్తున్నారు. ఆ తరవాత కనెక్షన్ మంజూరు అవుతుంది. ఇంటికి నల్లా వేసే సమయంలో కనెక్షన్లు ఇచ్చే గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో జలమండలికి నిర్ణీత మొత్తంలో కనెక్షన్ చార్జీలు చెల్లించినప్పటికీ తమకు అడిగినంత ఇవ్వనిదే కనెక్షన్ ఇచ్చేది లేదంటూ పలువురు గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్డు మంజూరు చేసిన పై పులను సైతం విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది ఆగడాలపై ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో ఈ భాగోతం యథేచ్ఛగా సాగుతుండడం గమనార్హం. నెలకు మూడు వేల కనెక్షన్లు.. జలమండలి పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 356 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ప్రతి నెలా నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మూడువేల నూతన నల్లా కనెక్షన్లను బోర్డు మంజూరు చేస్తోంది. వీటి ఏర్పాటుకు సుమారు 125 గ్రీన్‌బ్రిగేడ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బృందాల్లో పలువురు ప్రతి కొత్త కనెక్షన్‌కు.. భవనం, ప్రాంతాన్ని బట్టి రూ.25 వేల వరకు అదనంగా దండుకోవడం గమనార్హం. వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది ఆగడాలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరుతున్నారు. -
రూ.1కే నల్లా...
►13 లక్షల కుటుంబాలకు లబ్ధి ►నిరుపేదల దాహార్తి తీరే అవకాశం ►శివారు ప్రజలకు ఊరట ►ఏడాదిలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుచేస్తేనే ప్రయోజనం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ పథకం లబ్ధి ఇలా... ఒక్కో నల్లాకు నెలకు సరఫరా చేసే నీటి పరిమాణం:15 వేల లీటర్లు నెలవారీగా చెల్లించాల్సిన నీటిబిల్లు: రూ.150 తక్షణం కనెక్షన్లు ఇవ్వాలంటే..: రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన పైపులైన్ పనులను ఏడాదిలో పూర్తిచేయాలి. వెయ్యి కాలనీల్లో సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. {పస్తుతం గ్రేటర్లో ఉన్న నల్లా కనెక్షన్లు: 8.75 లక్షలు (మురికివాడల్లో సుమారు 2 లక్షల కనెక్షన్లు) రోజువారీగా జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు: 356 మిలియన్ గ్యాలన్లు రోజువారీగా నీటి డిమాండ్: 542 మిలియన్ గ్యాలన్లు నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటుతోనీటి డిమాండ్: నిత్యం 1000 మిలియన్ గ్యాలన్లు సిటీబ్యూరో: నిరుపేదల దాహార్తిని తీర్చేందుకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో రూపాయికే నల్లా కనెక్షన్ జారీచేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గ్రేటర్ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ నిర్ణయం ద్వారా గ్రేటర్ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారు 13 లక్షల నిరుపేద కుటుంబాల దాహార్తి తీరనుంది.మహానగర పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లాకనెక్షన్లుండగా..మురికివాడల్లో సుమారు రెండు లక్షల నల్లాలున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 13 లక్షల కుటుంబాలకు దశలవారీగా రూపాయికే నల్లా కనెక్షన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కాగా గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రూ.200కే కనెక్షన్ మంజూరు చేసేవారు. సర్కారు తాజా నిర్ణయంతో ఒక్కో కుటుంబానికి రూ.199 ఆదా కానుంది. కాగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీల్లో మంచినీటిసరఫరా వ్యవస్థ, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం హడ్కో సంస్థ జారీచేసిన రూ.1900 కోట్ల నిధులతో ఆయా ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను విస్తరిస్తున్నారు. ఈనేపథ్యంలో మరో ఏడాదిలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పది లక్షల పేద కుటుంబాలకు రూ.1 కే నల్లా కనెక్షన్లు ఏర్పాటు కానున్నాయని జలమండలి వర్గాలు తెలిపాయి.అయితే రూ.1కే కనెక్షన్ ఇచ్చినా..నెలకు ఒక్కో కుటుంబానికి సరఫరా చేయనున్న 15 వేల లీటర్ల నీటికి రూ.150 నీటిబిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశాయి. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాలకు తక్షణం కనెక్షన్ ఇస్తామని తెలిపాయి. సరఫరా వ్యవస్థ ఏర్పాటుతోనే ప్రయోజనం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ సుమారు వెయ్యి కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన పైపులైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రూ.1కే నల్లా కనెక్షన్ మంజూరు చేసినా..మంచినీరందించే వ్యవస్థ లేకపోవడం గమనార్హం. హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్లతో ఇటీవల చేపట్టిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులను ఏడాదిలో యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదల దాహార్తి తీరనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నల్లాలు సరే..నీళ్లేవి...? మహానగరం జనాభా కోటికి చేరువైంది. కానీ మొన్నటివరకు రాజధాని దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా(మెదక్), హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ప్రస్తుతం కృష్ణామూడుదశలద్వారా 270, గోదావరి మొదటిదశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని నగరానికి అత్యవసర పంపింగ్ ద్వారా తరలించి 8.75 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. కానీ నీటి డిమాండ్ 542 మిలియన్ గ్యాలన్లుగా ఉండడం గమనార్హం. అంటే ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటికి..డిమాండ్ మధ్య అంతరం 186 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. ఇక భవిష్యత్‌లో నల్లా కనెక్షన్ల సంఖ్య మరో 13 లక్షలు పెరిగితే నీటి డిమాండ్ వెయ్యి మిలియన్ గ్యాలన్లకు చేరుకోవడం తథ్యం. ఈనేపథ్యంలో ఈ స్థాయిలో నీటిని ఎక్కడినుంచి తరలిస్తారన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ శివార్లలో శామీర్‌పేట్(గోదావరిజలాలు), మల్కాపూర్(కృష్ణాజలాలు)లలో యుద్దప్రాతిపదికన రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించి 40 టీఎంసీల నీటిని సీజన్లో నిల్వచేస్తేనే గ్రేటర్ దాహార్తి తీరుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
నేటి నుంచి రూపాయికే నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. రెండు వారాల కిందే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నా, పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నద్ధమైంది. తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయనున్నారు. కనెక్షన్ కోసం కావాల్సిన పైపులతో పాటు రోడ్డు తవ్వకాల వ్యయాన్ని సైతం స్థానిక పురపాలికలే భరిస్తాయి. -
రూపాయికే నల్లా కనెక్షన్!
జీహెచ్ఎంసీ మినహా ఇతర నగరాలు, పట్టణాల్లో అమలుకు ప్రభుత్వం యోచన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్‌ను జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పురపాలనలో సంస్కరణల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో ఇది కూడా ఒకటి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఈ నెల 5న రాష్ట్రంలోని నగర, పురపాలికల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో రూపాయికే నల్లా కనెక్షన్‌తోపాటు 100 రోజుల ప్రణాళిక, పురపాలికల ఆదాయ, వ్యయాలు, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, వేసవిలో తాగునీటి సరఫరా, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించనున్నారు. పురపాలికల్లో అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించడంతో పాటు నీటి చార్జీలను పకడ్బందీగా వసూలు చేసేందుకు రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రకటించే అంశంపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. మేయర్ల సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ దీనిపై ప్రకటన చేయొచ్చు. -
నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచబ్యాంకు సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో ప్రతి నల్లాకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ పరిధిలో రూ.338 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకంలో ఈ మీటర్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. సర్కిల్ పరిధిలో సుమారు 25 వేల గృహవినియోగ నల్లాలకు వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఆటోమేటిక్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రపంచబ్యాంకు మంజూరు చేయనుంది. మీటర్ల ఏర్పాటుతోపాటు నీటి సరఫరాను ఆన్లైన్లో పక్కాగా పర్యవేక్షించేందుకు స్కాడా (సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనుంది. కాగా మల్కాజ్గిరి మంచినీటి సరఫరా పథకంతో ఈ ప్రాంత దాహార్తి తీరనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి 262 కి.మీ మార్గంలో ప్రధాన పైపులైన్లు, మరో 376 కి.మీ మార్గంలో పంపిణీ పైపులైన్ల ద్వారా ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రిజర్వాయర్లు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు వారం, పదిరోజులకోమారు నీటిసరఫరా జరుగుతోంది. ఈపథకం పూర్తితో కృష్ణా, గోదావరి జలాలను సర్కి ల్ వ్యాప్తంగా సరఫరా చేసే అవకాశం ఉంటుం దని, ఆటోమేటిక్ నీటిమీటర్ల ఏర్పాటుతో భవిష్యత్‌లో 24 గంటలపాటు నీటిసరఫరా చేసినప్పటికీ నీటి లెక్కలు పక్కాగా లెక్కగట్టడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. మీటర్ల ఎంపిక వినియోగదారులదే..! గ్రేటర్‌వ్యాప్తంగా ఆటోమేటిక్ మీటర్ల విధానాన్ని అమలు చేసేందుకు రూ.1600 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని ఎవరు భరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా మహానగరంలో 8.65 లక్షల నల్లాలుండగా..ప్రస్తుతం సగం నల్లాలకే నీటి మీటర్లున్నాయి. దీంతో ప్రతి నల్లాకు నీటి మీటరు ఏర్పాటు చేసుకునే బాధ్యతను జలమండలి వినియోగదారులకే అప్పజెప్పింది. గతంలో యూరో ప్రమాణాల ప్రకారం ఎంపికచేసిన తొమ్మిది మీటర్ కంపెనీలకు చెందిన మీటర్లనే విధిగా కొనుగోలు చేయాలన్న షరతు విధించింది. వీటి ధరలు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉన్నాయి. దీంతో కొందరు వినియోగదారులు ఇటీవల కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్పందించింది. వినియోగదారులు తమ ఇష్టానుసారం మీటర్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండాలని వ్యాఖ్యానించింది. కాగా బహిరంగ మార్కెట్లో మెకానికల్ నీటిమీటర్లు రూ.500 నుంచి రూ.750కు మాత్రమే లభ్యమవుతున్నాయి. కోర్టు వ్యాఖ్యలతో జలమండలి అధికారులు వెసులుబాటు కల్పించక తప్పనిపరిస్థితి ఏర్పడినప్పటికీ ఈవిషయంలో తుదినిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం. -
పరిపుష్ట పంచాయతీరాజ్
వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖను పరిపుష్ట స్థాయికి తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ వ్యవస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన వార్షిక నివేదికను బుధవారం ఆయన సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 8,600 గ్రామాలకు గాను 2,700 గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయగలగడం రికార్డుగా మంత్రి పేర్కొన్నారు. పుష్కలంగా ‘ఆసరా’ పింఛన్లు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు తెలంగాణలో 29 లక్షల మందికే పింఛన్లు ఇచ్చారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 36 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో కేవలం రూ.800 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం రూ.4,000 కోట్లు పింఛన్ల కోసం కేటాయించామన్నారు. అలాగే.. గ్రామాల్లో రూ.5,470 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.1,800 కోట్లతో తారురోడ్ల పునరుద్ధరణ, రూ.2,200 కోట్లతో కొత్తరోడ్లు, రూ.250 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం, రూ.600 కోట్లతో మట్టిరోడ్ల నిర్మాణం.. తదితర కార్యక్రమాలను చేపట్టామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ రహదారులకు ఇరువైపులా సుమారు 36 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా గ్రామీణాభివృద్ధి విభాగం చేపట్టిందన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ మంచినీటి నల్లా ఇచ్చి.. సీఎం ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 17 ఇంటేక్ వెల్స్ రక్షితస్థాయికి వచ్చాయన్నారు. సుమారు లక్ష కిలోమీటర్ల మేర కొత్తగా పైప్‌లైన్ వే స్తామన్నారు. తొలిదశ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.15,600 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, మరో రూ.8 వేల కోట్లకు వారంలోగా అనుమతి మంజూరు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఈ-పంచాయత్‌ల ఏర్పాటు మినహా గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ చేరుకోగలిగామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. తైవాన్‌కు కేటీఆర్ రెండు రోజుల పర్యటనకు కేటీఆర్ బుధవారం రాత్రి తైవాన్‌కు బయల్దేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తైవాన్‌లోని ఐ టీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయ న సమావేశమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇండియా-తైవాన్ బిజినెస్ కో-ఆపరేటివ్ ఫోరమ్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి పారిశ్రామిక పార్కులు సందర్శిస్తారు. -
చుక్క చుక్కకూ లెక్క!
ఇంటింటికీ నల్లా కనెక్షన్.. మీటర్ పట్టణ ‘వాటర్ గ్రిడ్’లో భాగంగా ప్రతిపాదనలు 24 గంటల సరఫరాపై ‘నియంత్రణ’కే పట్టణ ‘గ్రిడ్’ పనులకు రూ. 3,038 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు మీటర్‌ను సైతం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి వినియోగంపై నియంత్రణ కోసం మీటర్లు బిగించాల్సిందేనని భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ పనుల కోసం రూ. 3,038 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రజారోగ్య ఇం జనీరింగ్ విభాగం’ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ప్రధాన పైప్లైన్లు, సర్వీసు రిజర్వాయర్లు, అంతర్గత సరఫరా వ్యవస్థ, ఇళ్లకు నల్లా కనెక్షన్లు, మీటర్ల కోసం ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. నల్లా మీటర్ల కొనుగోలుకే రూ. 170.32 కోట్ల నిధులు కావాలని ఈ ప్రతిపాదనల్లో కోరింది. నీటి వృథాను అరికట్టడం, వినియోగం ఆధారంగా నీటి బిల్లులు వసూలు చేసేందుకు మీటర్లు తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు. రూ. 3 వేల కోట్లతో పట్టణ ‘గ్రిడ్’ హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాల పరిధిలో ఉన్న 67 నగరాలు, పట్టణ ప్రాంతాలకు ‘వాటర్ గ్రిడ్’ కింద నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉందని ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మూడు వేర్వేరు రకాల పనులను ప్రతిపాదించింది. అందుబాటులో సరిపడ నీళ్లున్నా.. సరఫరా వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్) లేక చాలా ప్రాంతాలకు నీటి సరఫరా జరగట్లేదు. ఈ నేపథ్యం లో 10 పట్టణాల్లో నీటి సరఫరా పనుల కోసం రూ.657.43 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నీటి సరఫరా నియమావళి ప్రకారం పట్టణ ప్రాం తాల్లో రోజూ ప్రతి వ్యక్తికి 135 లీటర్ల సరఫరాకు స్థానికంగా సరిపడ నీటి లభ్యత లేదు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న 24 పట్టణాల్లో రూ.717.51 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతోపాటు కొన్ని పాత మున్సిపాలిటీల్లో ముడి నీటి సరఫరా మెయిన్ పైప్లైన్లు, నీటి శుద్ధీకరణ వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్యాంకులు, సరఫరా వ్యవస్థ అందుబాటులో లేవు. రాష్ట్రంలోని 33 పట్టణాల్లో ఈ పనులకు రూ.1662.67 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. భవిష్యత్తు జనాభా అవసరాలకు.. వాటర్ గ్రిడ్ పథకం కింద 2050 నాటికి పెరగనున్న జనాభ అవసరాలను తీర్చేలా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా పట్టణ నీటి సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు మరో రూ. 2,276.09 కోట్లు అవసరమని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సర్కారుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.