‘గ్రేటర్ మిషన్’కు మోక్షం
శివార్లకు మంచినీటి భాగ్యం
మిషన్ భగీరథకు జీహెచ్‌ఎంసీ అనుమతులు
2700 కి.మీ పైప్‌లైన్ పనుల కోసం రోడ్‌కటింగ్‌కు ఓకే
2017 మే నాటికి పనుల పూర్తికి చర్యలు
సిటీబ్యూరో: మహా నగరంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు ఉద్దేశించిన గ్రేటర్ మిషన్ భగీరథ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 2700 కి.మీ మేర మంచినీటి సరఫరా పైప్‌లైన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ రహదారుల కోత(రోడ్ కటింగ్)కు అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం రెండు విభాగాల ఉన్నతాధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్‌లు సమావేశం నిర్వహించి ఈ పనుల పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇందులో 2000 కి.మీ మార్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను జలమండలి సొంత నిధులతో పూర్తిచేయనుంది. మరో 700 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్న భారీ మైల్డ్‌స్టీల్ పైపులైన్ల కారణంగా దెబ్బతినే రహదారుల పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీకి జలమండలి చెల్లించనుంది.
పైప్‌లైన్ పనులు పూర్తరుున వెంటనే రహదారుల మరమ్మతులు పూర్తిచేయాలని ఈ సమావేశంలో నిర్ణరుుంచారు. కాగా 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో ఏర్పాటు చేయాల్సిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులకు ఏడాది తర్వాత అనుమతులు లభించడం విశేషం. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను వచ్చే ఏడాది మే నాటికి దశలవారీగా పూర్తిచేసి 250 మిలియన్ లీటర్ల తాగు నీటిని వీటిల్లో నింపనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపారుు. వచ్చే ఏడాది మే నాటికి గ్రేటర్ మిషన్ భగీరథ పథకం పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఈ పథకం పూర్తితో శివార్లలో సుమారు 35 లక్షలమంది దాహార్తి తీరనుందని పేర్కొన్నారు.
గ్రేటర్ మిషన్ భగీరథ పనుల పూర్తి ఇలా...
రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం {పాంతాన్ని బట్టి ఒక మిలియన్ లీటర్ సామర్థ్యం నుంచి 22.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం వరకు స్టోరేజి రిజర్వాయర్లున్నారుు. కౌకూర్, జొన్నబండ రిజర్వాయర్లు మినహా 54 స్టోరేజి రిజర్వాయర్ల పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. వీటిలో 10 రిజర్వాయర్లను జనవరి, 2017, మరో పదింటిని ఫిబ్రవరి, మరో పదింటిని మార్చి, మరో పదింటిని ఏప్రిల్, మిగిలిన వాటిని మే 2017 నాటికి పూర్తిచేయనున్నారు. అన్ని స్టోరేజి రిజర్వాయర్లకు నీటిని నింపే ఇన్‌లెట్ పైపులైన్ల ఏర్పాటు పనులను డిసెంబరు నాటికి పూర్తిచేయనున్నారు.
స్టోరేజి రిజర్వాయర్ల నుంచి సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలకు మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన పంపిణీ పైప్‌లైన్లను మే 2017 నాటికి ఏర్పాటుచేయనున్నారు. మంచినీటి సరఫరాకు 100 డయా వ్యాసార్థం గల డకై ్టల్ ఐరన్‌పైపులు..స్టోరేజి రిజర్వాయర్లలో నీటిని నింపేందుకు 1300 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్లను ఏర్పాటు చేయనున్నారు. పనుల పూర్తి అనంతరం గ్రేటర్ (625 చ.కి.మీ)పరిధిలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయనున్నారు