రాజుపాళెం: టీఎఫ్‌సీ నిధులలో ఒక్క రూపాయి కూడా ఇవ్వమని సర్పంచులు తేల్చి చెప్పారు. మండల పరిషత్ సభా భవనంలో సోమవారం మండలంలోని సర్పంచులందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టీఎఫ్‌సీ నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర అవసరాలకు వాడేవారమన్నారు.
ఉన్న కొద్ది నిధులను విద్యుత్ బకాయిలకు కట్టాలని తీసుకుంటే అభివృద్ధి పనులను ఏ విధంగా చేయాలన్నారు. మండలంలో రూ.58 లక్షల 95,355 విద్యుత్ బకాయి ఉందన్నారు. టంగుటూరుకు రూ. 5, 60,531 విద్యుత్ బకాయిలు కట్టాలని చెప్పారన్నారు. టీఎఫ్‌సీలో రూ. 2 లక్షల 50 వేలు మాత్రమే ఉందని, మిగతా మొత్తం ఏవిధంగా కట్టాలన్నారు. విద్యుత్ బకాయిలు కట్టాలంటూ ఏ ఒక్క సర్పంచ్‌కు నోటీసులు రాలేదన్నారు. అనంతరం ఎంపీడీఓ రామచంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
ఒక్క రూపాయి ఇవ్వం
Published Tue, Dec 2 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement