పెనానికి అంటుకోకుండా, పేపర్‌లాగా దోస వెయ్యాలంటే అంత ఆషామాషీ కాదు. మరికొంత గృహిణులకు చెయ్యితిరిగిన దోస మాస్టర్లకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా పిండి పెనం మీద,రౌండ్‌గా తిప్ప కాసిన్న ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి, కాస్త కాలాక దోస తిరగవెయ్యాలని చూస్తామా.. అప్పుడు ఉంటుంది అసలు కథ. ఒక్క పట్టాన రానే రాదు.. పోనీ.. ఇంకోటి.. సేమ్ సీన్ రిపీట్.. హన్నన్నా.. నీ సంగతి చూస్తా.. అని ఇంకోటి ట్రై చేస్తే.. అదీ విరిగి ముక్కలవుతుంది.
చివరికి యూ ట్యూబ్, అదీ ఇదీ వెతికి వెతికి ఉల్లిపాయ కట్ చేసి తవాకి రాసి, నీళ్లు చల్లి తుడిచి, ఇలా నానా కష్టాలు పడ్డాక మొత్తానికి దోస అయ్యిందనిపిస్తాం. ఇపుడిదంతా ఎందుకంటే.. ఈ బాధలేవీ లేకుండా, చక్కగా దోసను మడతబెట్టేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఏకంగా1.3 కోట్ల వ్యూస్ దక్కించుకుంది.
వైరల్ వీడియోలో, పెనం మీద వేసిన దోస అలా అలవోకగా తీస్తున్న స్క్రాపర్‌ని మనం చూడొచ్చు. ఈ అద్భుతమైన స్క్రాపర్ నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.
బ్రో మసాలా దోసపై వేయడం ఇంత ఈజీనా.. సగం టైం క లిసొచ్చింది అని ఒకరు, చాలా బాగుంది. చేతులతో పనిలేకుండా పరిశుభ్రంగా ఉందిని మరొకరు వ్యాఖ్యానించారు. "బహుశా గతంలోబుల్డోజర్ డ్రైవర్’’ ఏమో,ఇన్‌స్టాగ్రామర్ “సిమెంట్ రోలర్” అని కొందరు అభిప్రాయ పడగా, వీటన్నింటికీ మించి ఈ మెషీన్ నాకూ కావాలి అని ఎక్కువ అంది కమెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment