ముంబై : అందరిలా రెగ్యులర్‌గా దోశలు వేస్తే స్పెషల్ ఏముంది అనుకున్నాడేమో ఏకంగా గాల్లోనే కస్టమర్ ప్టేట్లలోకి సర్వ్ చేస్తున్నాడు ముంబైకి చెందిన వ్యక్తి. మంగల్‌దాస్ మార్కెట్‌లోని శ్రీ బాలాజీ దోశ సెంటర్‌లో దోశలను గాల్లో చాలా ఎత్తు నుంచి తిన్నగా ప్లేట్‌లోకి వచ్చేలా సర్వ్ చేస్తారు. దీనికి సంబంధించిన వీడియోను 'స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్' అనే ఫేస్‌బుక్ పేజీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. వీడియో అప్‌లోడ్ చేసిన వారం రోజుల్లోనే ఏకంగా 8.44 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో దోశలు వేసే వ్యక్తితో పాటు అక్కడి దోశలు సైతం పాపులర్ అయ్యాయి. ఎగిరే దోశలు నెటిజన్లను విపరీతంగా ఆకర్సిస్తున్నాయి. గంటల్లోనే లైకులు, షేర్ చేస్తూ ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ వీడియోకు 1.3 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. అమేజింగ్ టాలెంట్ అంటూ నెటిజన్లు అతన్ని పొగడ్తలతో ముంచెతుతున్నారు. అమేజింగ్ టాలెంట్ అంటూ ఓ వర్గం అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరేమో విమర్శిస్తున్నారు. దోసలని అలా గాల్లోకి విసిరేయడం వల్ల ఆహారం పట్ల అది అగౌరవం చూపించినట్లు అవుతుందని, అంతేకాకుండా ఫుడ్‌తో ఆడుకోవడం చెత్త మార్కెటింగ్ స్టంట్ అని తిట్టి పోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment