టీఫెన్స్‌లో రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్న వంటకం ఏదంటే..'దోసె'. ఇప్పుడూ రకరకాల చెఫ్‌ల పాకశాస్త్ర నైపుణ్యం పుణ్యామా అని వైరేటీ దోసలు వచ్చేశాయి. కస్టమర్లు కూడా వెరైటీ దోసెలు ట్రై చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పుడూ రోడ్డు సైడ్ ఉండే చిన్న చిన్న స్టాల్స్‌లో కూడా విభిన్నమైన దోసెలు కూడా టేస్టీగా ఉండి కస్టమర్ల మనసులను దోచుకుంటున్నాయి.
అయితే ఈ స్ట్రీట్ సైడ్ అమ్మే వ్యాపారస్తుల్లో కొందరూ దోసెలు వేసే విధానం చూస్తే తినాలన్న ఆలోచనకంటే..ఆ స్టైలింగ్ స్కిల్ భలే ఆకట్టుకుంటుంది. అలానే సూపర్‌స్టార్ రజనీ రేంజ్ స్టైల్లో దోసెల వేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు ఓ వ్యాపారి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ముంబైలోని దారరలోని వీధి పక్కన ఉండే ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఆ వ్యాపారి ఏకకాలంలో ఓకేసారి నాలుగు దోసలు వేసే విధానం. అవి రెడి అయ్యాక పెనం మీద తీసే స్టైలింగ్ కోలీవుడ్ నటుడు రజనీకాంత్ స్టైల్‌లో ఎగరేస్తూ యమ ఫాస్ట్‌గా తీస్తుంటాడు. ఆ పక్కనే ఉన్న సహాయకుడు ఆయన విసిరే ప్రతి దోసెను భలే ఒడిసి పట్టుకునే విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ స్టాలల్‌లో విక్రేత దోసెలను వేసే విధానం, వాటిని మడత పెట్టి ప్లేట్‌లోకి విసిరే విధానం అచ్చం రజనీకాంత్ స్టైల్‌ని పోలి ఉంటుంది. ఈ వీడియోకి "ముంబై ప్రసిద్ద రజనీకాంత్ స్టైల్ దాదార్ దోసవాలా ముత్తు దాస్ కార్నర్, ముంబై స్ట్రీల్ ఫుడ్" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ దోస వాలా అతడి సహాయకుడు ఇద్దరు క్రికెట్ టీమ్‌లో ఉండాల్సిన వాళ్లు అంటూ వారి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఉత్తరాదిన సూర్యుడి భగభగలు..మానవ శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment