‘ఎక్స్‌’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..! | Dosa Bill Given In Gurugram Hotel Become Hot Topic In Twitter, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Gurugram Hotel Dosa Bill: ‘ఎక్స్‌’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!

Published Wed, Dec 6 2023 7:33 AM | Last Updated on Wed, Dec 6 2023 10:44 AM

Dosa Cost In Gurugram Become Hot Topic In Twitter - Sakshi

గురుగ్రామ్‌: ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్‌ సింగ్‌ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్‌ ఇడ్లీ ఆర్డర్‌ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ వచ్చింది.

హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్‌ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ఆశిష్‌ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు.

‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్‌’ అని ఒకాయన కామెంట్‌ చేశాడు. ‘వీధి టిఫిన్‌ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్‌ పెట్టాడు. 

ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement