
ఎండలు ఎలా మండుతున్నాయో తెలుసుగా.. అయితే.. కొందరు వామ్మో ఎండలు అని చిరాకు పడకుండా.. తమలోని క్రియేటివిటీకి ఇలా పదును పెడుతున్నారు. పెనంలా బాగా వేడెక్కిన తన స్కూటర్ సీటుపై ఓ వ్యక్తి ఇదిగో ఇలా దోశ వేసేశాడు.. ఈ వీడియోను ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ గొయెంకా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ప్రస్తుతం ఇది నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పునరుత్పాదక శక్తిని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడని కొందరు వ్యాఖ్యానించగా.. ఇంధనాన్ని ఆదా చేస్తూ.. దేశంలో ధరలను తగ్గించడంలో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వానికి సాయపడుతున్నాడంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేశారు.
వీడియోను చూడాలంటే ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి..