భారతదేశంలోని పలు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల్లో దోసదే అగ్రస్థానం. దీన్ని దోస లేదా దోసే/ దోసై వంటి పలు రకాల పేర్లతో పిలుస్తారు. దక్షిL భారతదేశ వంటకమైన ఈ దోసని బియ్యం, మినప్పులను నానబెట్టి రుబ్బగా వచ్చిన మిశ్రమంతో తయారు చేస్తారు. ఎలా పాపులర్ అయ్యిందో తెలియదు గానీ. ప్రపంచమంతా ఇష్టంగా తినే వంటకంగా 'దోస' మొదటి స్థానంలో ఉంది. అందువల్లో దీనికంటూ ఓ రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మార్చి 3ని ఈ వంటకానికి అంకితమిచ్చారు. అందువల్లే ప్రతి ఏడాది ఈ రోజున 'వరల్డ్ దోస డే' గా జరుపుకుంటున్నారు. ఈ వంటకం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యిన వంటకంగా నిలిచింది.
ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోసకు క్యాపిటల్‌గా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతలా ఫేమస్ అయిన ఈ దోస వంటకం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామా!.
దోస చరిత్ర..
మొదటగా తమిళనాడులో దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత క్రిస్పీగా ఉండే దోసెను కర్ణాటకలో తయారు చేయడం మొదలు పెట్టారు. ఉడిపి అనే రెస్టారెంట్ దోసెను ఇలా క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాల ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. ఈ దక్షిణ భారత వంటాకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. 1930లలో ఉడిపి హోటల్ మద్రాస్‌కి విస్తరించడంతో అక్కడ నుంచి ఢిల్లీకి ఇలా పాకింది. ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్‌లు తమ పాకనైపుణ్యానికి పదును పెట్టి మరీ రకరకాల దోసెలను తీసుకొచ్చారు.
ప్రజలు వాటిని కూడా ఆస్వాదించడం విశేషం. అలా దోసెలు కాస్త..మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్‌లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ వంటకం ఎలా వచ్చిందనేదనేందకు కచ్చితమైన ఆధారాలు లేవు కానీ సాహిత్య గ్రంథాల్లో వాటి ప్రస్తావన మాత్రం వచ్చింది. వాటి ఆధారంగా దోస మూలం ఆ రాష్టలేనని భావిస్తున్నారు చరిత్రకారులు.
దక్షిణ భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే..
ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తూ శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయపేర్కొన్నాడు. అంతేగాదు కన్నడ సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్లు అచాయ వెల్లడించాడు. అందువల్లే ఈ దోస మూలం ఏ రాష్టం అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. "ది స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్" అనే పుస్తకంలో కర్ణాటక రాజు సోమేశ్వర III గురించి ఉంది. ఆయన తన ప్రాచీన సాహిత్య రచన మానసోల్లాసలో దోసను 'దోసకా' అని సంబోధించాడు. పైగా ఆ వంటకం ఎలా తయారు చేస్తారో కూడా వివరించాడు.
ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఉద్భవించిందని ఉంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఏదీఏమైన నోరూరించే ఈ రెసిపీని అందరూ ఇష్టంగా ఆస్వాదించడం విశేషమైతే చెఫ్‌లు వాటి పాకనైపుణ్యంతో వెరైటీ దోసలు పరిచయం చేయంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యి, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలో మంచి క్రేజ్‌ని దక్కించుకున్న టాప్ వంటకంగా నిలిచిపోయింది.
(చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్‌లో ఏది ఇష్టపడతారంటే..)
Comments
Please login to add a commentAdd a comment