నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వుతోంది. అందులో విదేశాల్లోని రెస్టారెంట్‌లో మన దక్షిణభారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌ల పేర్లు, ధరలు గురించి షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌లో.. తాను అమెరికాలోని ఓ రెస్టారెంట్ మన దక్షిణ భారతదేశ అల్పహారాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
వాటి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం అన్నారు. నిజంగా ఆ పేర్లు వింటే గనుక ఖానే కా మజా ఖతం(ఇలాంటి పేర్లతో తింటే..తినడంలో ఉండే ఆనందం పోతుంది) అని క్యాప్షన్ జోడించి మరీ సదరు రెస్టారెంట్ మెనుని కూడా జత చేసి మరీ పోస్ట్ చేశారు. అందులో మన దక్షిణ భారతదేశపు అల్పాహారాల పేర్లుకు ఆ మెనులో ఉన్న ఫ్యానీ పేర్లు వరుసగా..వడకి "డంక్డ్ డోనట్ డిలైట్", ఇడ్డీకి "డంక్డ్ రైస్ కేక్ డిలైట్", దోసకి "నేక్డ్ క్రేప్" ఫ్యాన్సీ పేర్లు పెట్టి విక్రయించేస్తున్నారు.
ఇక వాటి ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. ప్లేట్ దోసె ధర రూ. 1400/-, ఇడ్లీ సాంబార్ ధర రూ. 1300/-, వడ ధర రూ.1400/-గా మెనులో ధరలు ఉండటం విశేషం. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బహుశా వాళ్లు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పనివాళ్లను పెట్టుకున్నారో అందుకే కాబోలు చుక్కలు చూపించేలా ఈ ధరలు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
Who knew vada, idli, and dosa could sound so fancy? With these strange names khaane ka mazaa khatam! Agree 😂? pic.twitter.com/Px94gQGUAd
— Harsh Goenka (@hvgoenka) July 2, 2024
(చదవండి: 'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..)
Comments
Please login to add a commentAdd a comment