కొత్తిమీరతో గ్రీన్‌ దోశ.. టేస్ట్‌తో పాటు హెల్తీ కూడా | Best Dosa Recipes: How To Make Healthy Green Dosa Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Green Dosa Recipe: కొత్తిమీరతో గ్రీన్‌ దోశ.. టేస్ట్‌తో పాటు హెల్తీ కూడా

Published Fri, Sep 29 2023 4:56 PM | Last Updated on Fri, Sep 29 2023 5:38 PM

How To Make Healthy Green Dosa Recipe In Telugu - Sakshi

గ్రీన్‌ దోశ తయారీకి కావల్సినవి:

బియ్యం – కప్పు; మినప పప్పు – కప్పు: మెంతులు – టీస్పూను;
కొత్తిమీర – కప్పు; పుదీనా – కప్పు; కరివేపాకు – అరకప్పు;
జీలకర్ర – అరటీస్పూను; వాము – చిటికెడు; ఉల్లిపాయ – ఒకటి;
పచ్చిమిర్చి – నాలుగు; ఉప్పు – టీస్పూను; నూనె –పావు కప్పు.

తయారీ విధానమిలా:
∙బియ్యం, మినపపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙నానాక వీటన్నింటినీ గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి ∙సగం మెదిగిన తరువాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేయాలి ∙అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ∙చక్కగా మెదిగిన పిండిని గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి ∙కాలిన పెనంపైన పిండిని దోశలా పోసుకుని కొద్దిగా నూనె వేయాలి ∙రెండువైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్‌ దోశ రెడీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement