బీరకాయ దోసెలకు కావలసినవి:
బియ్యం – అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి)
పెసలు –అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి)
బీరకాయ – అర కప్పు (తొక్క తీసేసి, చిన్నగా కట్ చేసుకోవాలి)
ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం ముక్క – చిన్నది
పచ్చిమిర్చి – 3 లేదా 4
నీళ్లు – కొద్దిగా\
పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
నూనె – కావాల్సినంత
ఉల్లిపాయ ముక్కలు – సరిపడా
తయారీ విధానం: ముందుగా బీరకాయ ముక్కలను మిక్సీ పట్టుకుని, మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసలు, బియ్యం వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడేంత ఉప్పు వేసుకుని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగు, బీరకాయ పేస్ట్ వేసుకుని మరోసారి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్ది కొద్దిగా నూనె వేసుకుని, దోసెలు వేసుకోవాలి. తర్వాత అభిరుచిని బట్టి.. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.
(చదవండి: వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!)
Comments
Please login to add a commentAdd a comment