
అన్నం దోసె తయారీకి కావల్సినవి:
అన్నం – 2 కప్పులు
పుల్లని పెరుగు, రవ్వ, గోధుమ పిండి– 1 కప్పు చొప్పున
ఉప్పు – రుచికి సరిపడా
వంట సోడా›– 1 టీ స్పూన్
నీళ్లు – తగినన్ని
తయారీ:
ముందుగా మిక్సీలో అన్నం, పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులో రవ్వ, గోధుమపిండి, వంట సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment