గత ఏడాది స్విగ్గీలో 29 మిలియన్ దోసెలు ఆర్డర్
మార్చి–3న ప్రపంచ దోసె దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: అల్పాహారంలో దోసెదే అగ్రస్థానం అనేది ప్రపంచ దోస దినోత్సవ నేపథ్యంలో మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడింంది. ఏటా మార్చి 3వ తేదీన దోసె దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 లోపు ఏకంగా 29 మిలియన్ల దోసెలు డెలివరీ చేసినట్టు తెలిపింది.
దేశవ్యాప్తంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో నిమిషానికి సగటున 122 దోసెలు ఆర్డర్ అయ్యా యి. ఇందులో బెంగళూరు టాప్‌లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇష్టమైన స్నా క్–టైమ్ డిష్‌గా దోసె మరోసారి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్‌కు చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో 447 ప్లేట్ల దోసెలు ఆర్డర్ చేసి.. దేశంలోనే ఛాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు పరాఠాలను ఎక్కువ ఇష్టపడే చండీగఢ్ వాసులు సైతం తమ ఇష్టమైన వంటకంగా దోసెను స్వీకరించడం విశేషం.
రంజాన్, క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్ సమయాల్లో అత్యధికంగా ఆర్డర్లు నమోదైన రెండో వంటకంగానూ.. నవరాత్రి సీజన్‌లో టాప్‌గా దోసె నిలిచింది. వీటిల్లో క్లాసిక్ మసాల దోసె అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ప్లె యిన్, సెట్, ఉల్లిపాయ, బటర్ మసాలా ఉన్నాయి. చాక్లెట్, పావ్ బాజీ నూడుల్స్ పాలక్, షెజ్వాన్ చాప్‌సూయ్ స్పెషల్, దిల్ ఖుష్ దోసెలను ప్రజలు ఆస్వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment