ఫుడ్ డెలివరీ సంస్థగా మొదలైన 'స్విగ్గీ' (Swiggy) నేడు పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని డెలివరీ చేస్తోంది. అత్యధిక డెలివరీలతో రికార్డ్ బ్రేక్ చేసి.. అర్ధరాత్రి వరకు కూడా కస్టమర్లను సేవలను అందిస్తూనే ఉంది. హైదరాబాద్‌లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంది.
జూన్ 2021లో ప్రారంభమైన స్విగ్గీ.. రోజువారీ అవసరాలు, బొమ్మలు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు, అలంకరణ సామాగ్రి, పండుగల సమయంలో కావాల్సిన వస్తువులను కూడా డెలివరీ చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ (Fast Delivery) చేస్తున్న వాటిలో పాలు, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరపకాయలు, కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ 'అమితేష్ ఝా' అన్నారు.
హైదరాబాద్ (Hyderabad)లో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకొని డెలివరీ చేసిన ఘనత స్విగ్గీ సొంతం. అంతే కాకూండా.. నగరంలో 2024లో 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేసింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్‌లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్‌లకు స్వీకరించింది.
లోదుస్తుల కోసం 18,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు, కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్‌లను స్విగ్గీ స్వీకరించింది. 2024లో 25,00,000 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేసింది. ప్రజలు ఆర్డర్ చేసిన మ్యాగీ ప్యాకెట్‌లను ఒకదానిపై ఒకటి పేర్చితే ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 25 కిలోమీటర్ల ఎత్తు అవుతుందని సమాచారం. మొత్తం మీదీ అదీ.. ఇదీ అని తేడా లేకుండా ప్రజలకు అవసరమైన వస్తువులను డెలివరీ చేసి అందరికీ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment