క్విక్‌ డెలివరీకి క్రేజ్‌ | Craze for quick delivery | Sakshi
Sakshi News home page

క్విక్‌ డెలివరీకి క్రేజ్‌

Published Wed, Sep 4 2024 3:32 AM | Last Updated on Wed, Sep 4 2024 3:32 AM

Craze for quick delivery

‘ప్రీ ప్రిపేర్డ్‌ ఫుడ్‌’సేవలు అందిస్తున్న జెప్టో, జొమాటో, స్విగ్గీ  

ఆర్డర్‌ ఇచ్చిన పది నిమిషాల్లోనే కుక్కుడ్‌ ఫుడ్‌ అందించే ఏర్పాట్లు  

ఇప్పటికే ముంబై, బెంగళూరులలో సేవలు ప్రారంభం 

రానున్న రోజుల్లో హైదరాబాద్, ఇతర నగరాలకు విస్తరించే ప్లాన్‌

సాక్షి, హైదరాబాద్‌: కస్టమర్ల అభిరుచులు..అవసరాలకు తగ్గట్టుగా వేగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి వంటి వాటిని అందించేందుకు క్విక్‌ (క్యూ)కామర్స్‌ సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తకొత్త ఆలోచనలను తెరపైకి తీసుకురావడంతోపాటు, విభిన్నమైన సర్వీసులను త్వరితంగా అందించడం ద్వారా వినియోగదారుల మనసును గెలుచుకునే దిశగా ఈ సంస్థలు వేగం పెంచాయి. 

తాజాగా ‘ప్రీ ప్రిపేర్డ్‌ ఫుడ్‌’క్విక్‌ డెలివరీ పేరిట టీ, కాఫీ, సమోసా, ఇతర స్నాక్స్‌ అందించేందుకు జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి క్యూ–కామర్స్‌ దిగ్గజాలు పోటీకి సై అంటున్నాయి. తమతమ యావరేజ్‌ ఆర్డర్‌ వాల్యూ (ఏవోయూ)లను పెంచుకునేందుకు 10 నిమిషాల్లో కుక్కుడ్‌ ఫుడ్‌ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో ఈ సేవలు ›మొదలై ఆదరణ పొందుతున్నాయి. 

రానున్న రోజుల్లో హైదరాబాద్‌ సహా ఇతర నగరాలకు తమ ప్రణాళికలను ఈ సంస్థలు విస్తరించనున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలతోపాటు నా¯Œన్‌ మెట్రో నగరాలకు ఈ సేవల విస్తరణకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. రోజువారీ బిజీ జీవితం, ఆఫీసు నుంచి ఇళ్లకు సుదీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్‌ సమస్యలు తదితరాలతో క్విక్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ వైపు వినియోగదారుల మొగ్గు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.  

» జెప్టో ప్రయోగాత్మకంగా గతేడాది ముంబైలో ‘జెప్టో కేఫ్‌’ను ప్రారంభించింది. ఇప్పుడు ముంబైతోపాటు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంది.  

» స్విగ్గీ కూడా బెంగళూరులో ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఇన్‌స్టాకేఫ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.  

»  క్యూ– కామర్స్‌ సంస్థల మధ్య పోటీ తీవ్రంకావడంతో తమతమ సరాసరి ఆర్డర్ల విలువలను గణనీయంగా పెంచుకోవడంపై ఇవి దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఈ సంస్థలు ఆఫర్‌ చేస్తున్న స్నాక్స్‌ , ఇతర ఆహార పదార్థాలు దేశవ్యాప్తంగా సూపర్‌ మార్కెట్‌ చెయిన్లలో రూ.30 నుంచి 300 లోపు అందుతున్నా, హోం డెలివరీ రూపంలో కోరుకున్న సమయానికి వేగంగా ఇళ్లకు ఆర్డర్లు అందజేయడమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. 

ఇప్పటికైతే కస్టమర్లు ఈ సంస్థలు అందిస్తున్న సేవలను ఆహా్వనిస్తున్నారు. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌ల మాదిరిగా కాకుండా వివిధ రకాల వస్తువులతో (రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా) పాటుగా ఫుడ్‌ ఐటెమ్స్‌ కూడా ఒకేసారి తెప్పించుకునేందుకు అవకాశం ఉండటమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. యూఎస్‌ఏ, యూకే, లాంటి దేశాల్లో ఈ ఐడియాను ముందుగా అమలు చేయడంతోపాటు వినియోగదారులు చేసే ఆర్డర్ల సంఖ్యను పెంచేందుకు స్నాక్స్‌ ఇతర ఆహార పదార్థాలను చేర్చారు. 

ఎల్రక్టానిక్‌ గాడ్జెట్స్, ఇతర లగ్జరీ వస్తువులతో పోలి్చతే స్నాక్‌ ఐటెమ్స్‌కు వచ్చే మార్జిన్‌ అంత హెచ్చుస్థాయిలో లేకపోయినా రోజువారీ నిత్యావసర వస్తువుల కంటే మాత్రం స్నాక్స్‌ రేట్స్‌కు అధిక మార్జిన్‌తో ఎక్కువ ఆదాయం సమకూరుతున్నట్టుగా నిపుణులు లెక్కలు వేస్తున్నారు.  

» కోల్‌కతాకు చెందిన సౌమాసేన్‌ ప్రతీరోజు ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు లోకల్‌ మార్కెట్‌కు వెళ్లి తాజా పండ్లు, కూరగాయలు తెచ్చుకోవడంతోపాటు అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో అత్యవసరంగా ఎండు మిర్చీ, మస్టర్డ్‌ ఆయిల్, తదితర వస్తువుల కోసం దగ్గరలోని మార్కెట్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడేది. అదే ఇప్పుడు క్విక్‌ డెలివరీ యాప్, సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఆయన కోరుకున్న రోజువారి వస్తువులు కేవలం ఏడు నిమిషాల సమయంలోనే హోం డెలివరీ ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. 

అయితే మామూలుగా కొనుగోలు చేస్తున్న దాని కంటే ఈ సర్వీసులకు కొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తున్నా సేన్, ఆయన భార్య ఉద్యోగులు కావడంతో యాప్‌లపై ఆర్డర్‌ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. నేడు వేగంగా మారుతున్న పరిస్థితులు..క్విక్‌ కామర్స్‌ యాప్స్‌ అందుబాటులోకి రావడంతో వస్తువుల ఆర్డర్‌ అనేది సులభమై పోయింది.  

» రోజువారీ జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులను 10 నుంచి 15 నిమిషాల్లో ఇళ్ల వద్దనే తెప్పించుకోవడం అనేది నవయువ తరానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. రోజువారీ జీవనశైలి అలవాట్లలో మార్పులు, వేగం పెరిగిన బిజీలైఫ్‌ తదితరాలకు తగ్గట్టుగా వివిధ వర్గాల కస్టమర్ల అభిరుచులు, అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి. వీటన్నింటిని తీర్చేలా క్విక్‌ కామర్స్‌ సంస్థలు పోటీపడి కొత్త కొత్త ఆలోచనలతో డెలివరీ యాప్స్‌కు పదును పెడుతున్నాయి. 

అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ దిగ్గజ సంస్థలు ఈ విధమైన వ్యాపారంలో ముందంజలో ఎందుకు నిలవడం లేదన్న ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇవేకాకుండా దేశీయంగా పెద్ద పెద్ద కంపెనీలు, దేశవ్యాప్తంగా సప్లయి చెయిన్లు ఉన్న బడా సంస్థలు కూడా క్యూ–కామర్స్‌ మార్కెట్‌ను అధిగమించలేకపోవడం కూడా ఓ సవాల్‌గానే నిలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement