Oats Palak Dosa And Oats Palak Uttapam Breakfast Recipe In Telugu | Healthy Breakfast Recipes Tips Pregnant Women - Sakshi
Sakshi News home page

Palak Dosa: గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉంటేనే! పాలక్‌ దోసె, ఓట్స్‌ పాలక్‌ ఊతప్పం..

Published Sat, Nov 26 2022 10:41 AM | Last Updated on Sat, Nov 26 2022 4:12 PM

Recipes: Healthy Breakfast For Pregnant Palak Dosa Oats Palak Uttapam - Sakshi

పాలక్‌ దోసె

Recipes In Telugu: గర్భిణి తినే ఆహారం ప్రత్యేకంగా ఉండాలి. మామూలుగా ఎప్పుడూ తినే ఆహారం సరిపోదు. ఆహారంలో ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉండాలి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఓట్స్‌, చిరుధాన్యాలు, పాలకూరలతో ఇలా హెల్దీగా ప్రయత్నించి చూడండి. 

ఓట్స్‌ పాలక్‌ ఊతప్పం 
కావలసినవి
►ఓట్స్‌ పొడి – కప్పు (కొంచెం రవ్వలా ఉండాలి)
►మినప పిండి – పావు కప్పు
►పచ్చిమిర్చి పేస్ట్‌ – 2 టీ స్పూన్‌లు
►పాలకూర పేస్ట్‌ – అర కప్పు

►ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
►ఉడికించిన గింజలు – ముప్పావు కప్పు (వేరుశనగ, పెసలు, శనగలు వంటివి)
►నూనె లేదా నెయ్యి– 4 టీ స్పూన్‌లు
►ఉప్పు – పావు టీ స్పూన్‌ లేదా రుచికి తగినంత
►చాట్‌ మసాలా – టీ స్పూన్‌ (ఇష్టమైతేనే).

తయారీ:
►ఓట్స్‌ పొడి, మినపపిండి, మిర్చి పేస్ట్, పాలకూర పేస్ట్, ఉప్పు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాలపాటు పక్కన ఉంచాలి. 
►మినీ ఊతప్పాల పెనం (మామూలు పెనం మీద కూడా వేసుకోవచ్చు) స్టవ్‌ మీద పెట్టి ప్రతి గుంతలోనూ రెండు చుక్కల నెయ్యి వేసి గుంత మొత్తానికి అంటేటట్లు మునివేళ్లతో రుద్దాలి.
►పెనం వేడి అయిన తర్వాత చిన్న గరిటెతో పిండి మిశ్రమాన్ని గుంతల్లో పోయాలి.

►పిండి కాలేలోపుగా ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గింజలను వేసి మూత పెట్టి సన్న మంట మీద కాలనివ్వాలి.
►ఒకవైపు కాలిన తర్వాత స్పూన్‌తో జాగ్రత్తగా తిరగేసి మూత పెట్టకుండా కాలనివ్వాలి.
►రెండోవైపు కూడా కాలిన తరవాత తీసి చాట్‌ మసాలా చల్లి వేడిగా ఉండగానే కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వడ్డించాలి.
►మినపపిండి లేకపోతే పావు కప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఓట్స్‌ పౌడర్‌ కలుపుకోవాలి. 

పాలక్‌ దోసె
కావలసినవి :
►పాలకూర పేస్ట్‌ – అర కప్పు (సుమారు రెండున్నర కప్పుల పాలకూర ఆకులను రుబ్బితే అరకప్పు పేస్టు వస్తుంది)
►మినప్పప్పు – పావు కప్పు
►మెంతులు – అర టీ స్పూన్‌
►గోధుమపిండి– కప్పు
►ఉప్పు – పావు టీ స్పూన్‌ లేదా రుచికి తగనంత
►నూనె – 2 టీ స్పూన్‌లు.

తయారీ:
►మినప్పప్పు, మెంతులను కడిగి నిండుగా నీటిని పోసి మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టాలి.
►ఆ తర్వాత తగినంత నీటిని కలుపుకుంటూ మెత్తగా రుబ్బాలి.
►ఈ పిండిలో పాలకూర పేస్ట్, గోధుమపిండి, ఉప్పు వేసి అవసరమైతే మరికొన్ని నీటిని పోసి గరిటె జారుడుగా కలిపి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి.
►ఆ తర్వాత పెనం వేడి చేసి దోసె పోసుకోవాలి.
►దోసె మీద నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి లేదా వెన్న వేసుకోవచ్చు.  

ఇవి కూడా ట్రై చేయండి: Makhana Panjiri: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement