
వన్ దోశ డబుల్ పెనం
మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటని ఎవరినైనా అడిగితే.. చాలామంది ఠక్కున చెప్పే సమాధానం ‘దోశ’.
మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటని ఎవరినైనా అడిగితే.. చాలామంది ఠక్కున చెప్పే సమాధానం ‘దోశ’. మరి అలాంటి దోశను ఉదయాన్నే తయారు చేయాలంటే, వేరే పనులు మానుకోవాల్సిందే. కానీ ఇకపై అలాంటి శ్రమే అవసరం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ దోశ మేకర్ కూడా వచ్చేసింది. దీంట్లో టెంపరేచర్ కంట్రోలర్ ఉండటం వల్ల వంటింట్లో మీరు వేరే పనులు చేస్తూ కూడా దోశలు వేసుకోవచ్చు. ఎలా అంటే.. ముందుగా ఈ దోశ మేకర్‌లో పిండి వేసి, 2-3 చుక్కల నూనె చల్లి మూత పెట్టి టెంపరేచర్‌ను సెట్ చేయాలి. ఇందులో, మీడియం, హై, లో టెంపరేచర్లకు వేర్వేరు బటన్స్ ఉంటాయి.
మీకు ఏది అవసరమో ఆ బటన్ నొక్కితే చాలు. దోశను రెండువైపులా తిప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికి కిందా పైనా పెనం ఉన్నట్టే. మేకర్ మూత కిందిభాగంలో ఉబ్బెత్తు గీతలుంటాయి. దాంతో మీ దోశపై పడే చారలు చేతితో వేసిన దోశల్లా కనిపిస్తాయి.