ప్రతీకాత్మక చిత్రం
లక్నో: కట్టుకున్న భర్త పరాయి ఆడదాన్ని చూస్తే కాళికా అవతారం ఎత్తుకుంది ఇల్లాలు. అలాంటిది ఏకంగా ప్రియురాలితో కలిసి చాటుగా టిఫినీలు తినిపించుకుంటుంటే ఊరుకుంటుందా? శివాలెత్తిపోతుంది. ఇదిగో ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ కూడా తన భర్త వేరే మహిళతో కలిసి ఉండటం చూసి వారిని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బాందాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇదివరకే పెళ్లైంది. ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయిన అతడు తన ప్రియురాలిని వెంటేసుకుని గుడికి వెళ్లాడు. (చదవండి: ఘోర విషాదం : పొగమంచు ఎంత పని చేసింది!)
కానీ ఆలయంలోకి వెళ్లకుండా కారులో కూర్చొని దోశ ఆర్డర్ చేశాడు. వేడి వేడి దోశ వచ్చేలోపే నిప్పులు చెరుగుతూ అతడి భార్య కళ్ల ముందు ప్రత్యక్షమైంది. భర్త నిర్వాకం తెలిసి తన సోదరుడిని వెంటేసుకుని మరీ రంగంలోకి దిగిన ఆమె వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. "నేనుండగా నీకు ఇంకొకరు కావాల్సి వచ్చిందా?, ఇలా ఎందరితో తిరుగుతావు?' అంటూ భర్తకు చీవాట్లు పెడుతూ ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లింది. ఇదేమీ మొదటిసారి కాదని, తన భర్త చాలామంది అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బోరుమంది. అయితే పోలీసులు మాత్రం అతడిని హెచ్చరించి వదిలేశారు. (చదవండి: ‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’)
Comments
Please login to add a commentAdd a comment