Banda
-
షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు
లక్నో: ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ బాందాలో స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లింది. బాందా జిల్లాలోని మవాయ్ బుజర్గ్ గ్రామంలో బుధవారం ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహం చిక్కుకోవడంతో రాపిడికి ట్రక్కు కింద నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిమాపక యంత్రాలు వెళ్లి మంటలను ఆర్పాయి. పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసేందుకు శ్రమించారు. చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? -
ప్రియురాలికి దోశ ఆర్డర్: అడ్డంగా దొరికిన భర్త
లక్నో: కట్టుకున్న భర్త పరాయి ఆడదాన్ని చూస్తే కాళికా అవతారం ఎత్తుకుంది ఇల్లాలు. అలాంటిది ఏకంగా ప్రియురాలితో కలిసి చాటుగా టిఫినీలు తినిపించుకుంటుంటే ఊరుకుంటుందా? శివాలెత్తిపోతుంది. ఇదిగో ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ కూడా తన భర్త వేరే మహిళతో కలిసి ఉండటం చూసి వారిని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బాందాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇదివరకే పెళ్లైంది. ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయిన అతడు తన ప్రియురాలిని వెంటేసుకుని గుడికి వెళ్లాడు. (చదవండి: ఘోర విషాదం : పొగమంచు ఎంత పని చేసింది!) కానీ ఆలయంలోకి వెళ్లకుండా కారులో కూర్చొని దోశ ఆర్డర్ చేశాడు. వేడి వేడి దోశ వచ్చేలోపే నిప్పులు చెరుగుతూ అతడి భార్య కళ్ల ముందు ప్రత్యక్షమైంది. భర్త నిర్వాకం తెలిసి తన సోదరుడిని వెంటేసుకుని మరీ రంగంలోకి దిగిన ఆమె వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. "నేనుండగా నీకు ఇంకొకరు కావాల్సి వచ్చిందా?, ఇలా ఎందరితో తిరుగుతావు?' అంటూ భర్తకు చీవాట్లు పెడుతూ ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లింది. ఇదేమీ మొదటిసారి కాదని, తన భర్త చాలామంది అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బోరుమంది. అయితే పోలీసులు మాత్రం అతడిని హెచ్చరించి వదిలేశారు. (చదవండి: ‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’) -
‘అందుకే ఆఫీసులో హెల్మెట్ పెట్టుకుంటాం’
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రతిరోజూ హెల్మెట్ ధరించే ఆఫీసుకు వెళ్తారు. అంతేకాదు కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా హెల్మెట్ పక్కన పెట్టకుండానే పనిచేసుకుంటారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 మీద ఉన్న భయం వలనో, భక్తి వలనో వీరిలా చేస్తున్నారనుకుంటే పొరబాటే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పడే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వారు ఇలా చేయడం లేదు. పనిచేసే చోట ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వేరే గత్యంతరంలేక ఈ మార్గం ఎంచుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే... విద్యుత్ శాఖకు చెందిన బాందా జిల్లాలోని ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కప్పు ఎప్పుడు ఊడి మీద పడుతుందో తెలియని దుస్థితి. కాస్త వర్షం పడినా పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగులే ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నారు. కాగా హెల్మెట్లు ధరించి ఆఫీసులో పనిచేసుకుంటున్న ఉద్యోగుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి విద్యుత్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ‘ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి గత్యంతరం లేక ఇలా హెల్మెట్‌తో కాలం వెళ్లదీస్తున్నాం. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఫైళ్లు భద్రపరుచుకునేందుకు సరైన అల్మారాలు లేవు. కుర్చీలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. వర్షం వస్తే గొడుగులు పట్టుకుని పనిచేస్తాం. ఇంతా జరుగుతున్నా సీనియర్లకు మా బాధలు పట్టవు. కప్పు కూలి మాలో ఎవరో ఒకరు చచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం వెదుకుదామని వాళ్లు ఆలోచిస్తున్నారేమో. అప్పుడే భవనాన్ని రిపేరు చేస్తారు కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. -
జైలులో ఎమ్మెల్యేకు గుండెపోటు
బాందా: ఉత్తర్‌ప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ లక్నోలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బాందా జైలుకు తిరిగి వచ్చారు. జనవరి 9న ఆయనకు గుండెపోటు రాగా జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో గత రాత్రి ఆస్పత్రి నుంచి పంపించారని, గట్టి బందోబస్తు మధ్య జైలుకు తిరిగి తీసుకొచ్చారని జైలర్ వివేక్షీల్ శుక్రవారం తెలిపారు. 55 సంవత్సరాల అన్సారీపై అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, జైలులో తన భార్యను కలుసుకున్నాక గుండెపోటుకు గురయ్యారన్నారు. గ్యాంగ్‌స్టర్ అయిన అన్సారీ మవు నియోజకవర్గం నుంచి గెలుపొందారని, 2015 నుంచి రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
యూపీలో రైలు ప్రమాదం ముగ్గురు మృతి
-
యూపీలో రైలు ప్రమాదం
బండా(యూపీ) : వాస్కోడిగామా పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బండా సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. పట్టా విరగడంతో రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఇండియన్ రైల్వేస్ పీఆర్ఓ అనిల్ సక్సేనా తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, గాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా ప్రభుత్వం ప్రకటించింది. -
భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి
-
భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు బుధవారం అర్థరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా... పలువురు గాయపడ్డారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
'సమాజ్‌వాది పార్టీతో చేతులు కలపండి'
లక్నో: లోక్‌సభ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తి చిదంబరం హైకమాండ్ ను ధిక్కరించే విధంగా మాట్లాడి 24 గంటలు గడవకముందే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు గళం విప్పారు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీని బలోపేతం చేయాలని ఉత్తరప్రదేశ్ లోని బంద నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ కుమార్ సింగ్ ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎస్ఎంఎస్ పంపించారు. పార్టీని బలోపేతం చేయండి లేదా మతతత్వ శక్తులతో పోరాటం చేయడానికి యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీతో చేతులు కలపాలని ఆయన సూచించారు. -
బండ్ల, అంజన్ యాదవ్ అనచరుల గలాట