పాట్నా: మసాలా దోసతో పాటు సాంబారు ఇవ్వనందుకు కస్టమర్‌కు రూ.3,500 జరిమానా చెల్లించాలని బిహార్‌లో ఓ హోటల్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.140 పెట్టి కొనుక్కున్న స్పెషల్ మసాలా దోసకు సాంబార్ ఇవ్వలేదంటూ మనీశ్ గుప్తా అనే లాయర్ కమిషన్‌ను ఆశ్రయించాడు.
పుట్టిన రోజు సందర్భంగా బక్సర్‌లోని నమక్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. స్పెషల్ దోశ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి చూస్తే సాంబార్ లేదు. హోటల్‌కు ఇదేమిటని నిలదీస్తే, ‘రూ.140కి హోటల్ మొత్తం రాసిస్తారా?’ అంటూ ఓనర్ వెటకారం చేయడంతో అతనికి మనీశ్ లీగల్ నోటీసు పంపించాడు. స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
Comments
Please login to add a commentAdd a comment