
మియాపూర్ : మసాల దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశల రుచి చూస్తుంటారు...దోశల్లో వెరైటీలను తినాలనుకుంటున్నారా... మియాపూర్ రావాల్సిందే. ఒకేచోట 111 రకాల దోశలు ఆహారప్రియుల మది దోచుకుంటున్నాయి. చందానగర్‌లోని ప్రధాన రహరిదారిలో ఉన్న బిందు టిఫిన్‌సెంటర్‌లోఈ వెరైటీ దోశలు లభిస్తున్నాయి.
ఏమేం దోశలంటే..
తీన్మార్ దోశ, పిజ్జాదోశ, కాజుదోశ, దిల్‌కుష్‌దోశ, పావ్‌బాజీ దోశ, ప్రకృతి దోçశ, కేరళ ఓపెన్, అమెరికన్ చొప్సే దోశ లున్నాయి. ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా పన్నీర్‌దోశ, మష్రూమ్‌దోశ, స్వీట్‌కార్న్ దోశ, బేబీకార్న్, మైసూర్ మసాలదోశ ఇష్ట పడుతుంటారు. ఇంకా ప్లెయిన్ దోశలో 8 రకాలు, మసాల దోశలో 15 రకాలు, పెసరదోశలో17, రాగిదోశలో 18 రకాలు, చెజ్వీన్ 21 రకాలు లభిస్తాయి. మియాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల నుంచి దోశె ప్రియులు ఇక్కడికివస్తుంటారు. సంగారెడ్డి జిల్లా ఇంకేమూరి గ్రామానికి చెందిన పండరిరెడ్డి, సంజీవరెడ్డిలు దీనిని నిర్వహిస్తున్నారు.
బెంగళూర్‌లో చూసి..
బెంగళూరులోని హోటల్లో 100 రకాల వెరైటీ దోçశలు తయారీని చూశారు. దీంతో అలాంటి టిఫిన్ సెంటర్ హైదరాబాదులో నిర్వహించాలని అనుకున్నారు.ఒక మాస్టర్ దగ్గర దోçశల వెరైటీలను నేర్చుకున్నారు. టాటా మ్యాజిక్ బండిని టిఫిన్ సెంటర్‌గా తయారు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment