Special Dosa Recipes: How To Prepare Moringa Dosa Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Moringa Dosa Recipe: మురిపముగా.. మొరింగ్‌ దోశ చేసుకోండి ఇలా..!

Published Fri, Jun 30 2023 10:15 AM | Last Updated on Fri, Jul 14 2023 4:00 PM

Mooring Dosa Recipe Try This Way - Sakshi

మొరింగా దోశ తయారీకి కావలసినవి :
మునగ ఆకులు – రెండు కప్పులు
ఇడ్లీ పిండి – రెండు కప్పులు
నూనె – మూడు టీస్పూన్లు
జీలకర్ర – అరటీస్పూను
మిరియాలు – అరటీస్పూను
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు;
ఇంగువ – చిటికెడు 
ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ విధానం: ∙బాణలిలో రెండు టీస్పూన్లు నూనె వేసి వేడెక్కనివ్వాలి. ∙కాగిన నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ∙ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న మునగ ఆకులు వేయాలి. ఆకుల్లోని నీరంతా ఇగిరిపోయాక దించేయాలి. ∙మునగ ఆకుల మిశ్రమం చల్లారాక ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకోవాలి. ∙ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ పేస్టుని వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ∙దోశపెనం వేడెక్కిన తరువాత పిండిని దోశలా పోసుకుని, టీస్పూను నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మొరింగాదోశ రెడీ. సాంబార్, కొబ్బరి చట్నీలు దీనికి మంచి కాంబినేషన్‌. 

(చదవండి: విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement