Best Dosa Recipes: How To Prepare Surnali Dosa In Telugu - Sakshi
Sakshi News home page

Surnali Dosa Recipe: సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి!

Published Tue, Aug 2 2022 5:03 PM | Last Updated on Tue, Aug 2 2022 5:30 PM

Recipes In Telugu: How To Prepare Surnali Dosa - Sakshi

బియ్యపు రవ్వ.. అటుకులతో చేసే సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో ఇంట్లో ఇలా తయారు చేసుకోండి!
కావలసినవి:
►బియ్యపురవ్వ – రెండు కప్పులు
►అటుకులు – కప్పు
►పచ్చికొబ్బరి తురుము – కప్పు
►ఉప్పు – రుచికి సరిపడా
►నూనె – దోసె వేయించడానికి తగినంత. 

సూర్నాలి దోశ తయారీ ఇలా:
►బియ్యపురవ్వను శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.
►నానిన రవ్వలో ఉన్న నీటిని తీసేసి మిక్సీజార్‌లో వేయాలి.
►అటుకులను కూడా కడిగి జార్‌లో వేయాలి.
►వీటికి కొబ్బరి తురుముని జోడించి కొద్దిగా నీటిని కలిపి దోసెపిండిలా రుబ్బుకోవాలి.

►రుబ్బిన పిండిని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి.
►మరుసటి రోజు ఉదయం ఉప్పు కలిపి దోసెలు పోసుకోవాలి.
►దోసె కాలడానికి సరిపడినంత నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సుర్నాలి దోసె రెడీ.
►ఈ దోసె ఏ చట్నీతోనైనా చాలా రుచిగా ఉంటుంది. 

ఇవి కూడా ట్రై చేయండి: Oats Uthappam Recipe: ఓట్స్‌ ఊతప్పం తయారీ విధానం ఇలా!
Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్‌ రింగ్స్‌ తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement