మురళీ సార్‌.. దోశను చంపుతున్నారు | Muralitharan, IPl 2019, From Doosra To Dosa Photo Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

మురళీ సార్‌.. దోశను చంపుతున్నారు

Mar 28 2019 4:52 PM | Updated on Mar 28 2019 5:03 PM

Muralitharan, IPl 2019, From Doosra To Dosa Photo Goes Viral In Social Media - Sakshi

దోస తింటున్న సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌

ఒకప్పుడు దూస్రాలతో బ్యాట్స్‌మన్‌ను  బెంబేలెత్తించిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌  ముత్తయ్య మురళీధరన్‌ దోస తింటున్న ఫొటో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌  చేస్తోంది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న మురళీధరన్, తన టీం సభ్యులతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తింటున్నప్పుడు కీపర్‌ శ్రీ వాత్సవ గోస్వామి ఫొటో తీశాడు. ‘మురళీ సార్‌ దోశను చంపుతున్నారు’ అనే  అర్థంతో సన్‌ రైజర్స్‌ జట్టు ఆటగాడు గోస్వామి చేసిన ట్వీట్‌పై చాలామంది నెటిజన్లు జోకులు వేస్తూ, షేర్‌ చేస్తున్నారు. 

మురళీధరన్‌ దోశ తింటున్న ఫొటో షేర్‌ చేసిన  శ్రీవాత్సవ గోస్వామికి పంజాబ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. సారథి కేన్‌ విలియమ్స్‌ గైర్హాజరీలో ఆడిన ఆ మ్యాచ్‌లో రైజర్స్‌ జట్టు ఓటమి పాలైంది. డేవిడ్‌ వార్నర్‌ 53  బంతుల్లో 85 పరుగులతో అదరగొట్టడంతో రైజర్స్‌ 181 పరుగులు చేయగలిగింది. కానీ ఛేదనలో భీకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి కోల్‌కత్తా జట్టును సులభంగా విజయ తీరాలకు చేర్చాడు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement