కాగితంపై అక్షరాలు ప్రింట్ తీయడం చూశాం.. ఫొటోలు ప్రింట్ తీయడం చూశాం.. ఫ్లెక్సీలు ప్రింట్‌లు వస్తున్నాయి. ప్రింటర్లలోనూ కలర్, బ్లాక్ అండ్ వైట్, 3డీ, ఇంకా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దోశను ప్రింట్ తీయడం ఎప్పుడైనా విన్నారా.. కొత్తగా ఉంది కదూ.. నిజమే ఇటీవల కాలంలో మార్కెట్‌లోకి కొత్తగా దోశ మేకర్ (ప్రింటర్) అందుబాటులోకి వచి్చంది. వంటింట్లో ఇప్పటికే అనేకరకాలైన ఆధునిక వస్తువులు వినియోగిస్తున్నాం. తాజాగా చెన్నైకి చెందిన ఓ సంస్థ దోశ ప్రింటర్‌ను అభివృద్ధి చేసింది. ప్రింటర్‌కు ఒక వైపు ట్రే ఉంటుంది. అందులో పిండి వేస్తే సరిపోతుంది.
నిమిషానికి ఒక దోశ వస్తుంది. దోశను ఎంత మందంతో కావాలనుకుంటే ఆ విధంగా మనం మర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ ఆటోమేటిక్ దోశ మేకర్‌కు 360 డిగ్రీల ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్ అమర్చి ఉంటుంది. ఈ యంత్రం 1600 వాట్ల విద్యుత్తు శక్తితో పనిచేస్తుంది. అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తుందని తయారీ సంస్థ పేర్కొంటోంది. పరిమాణం చిన్నగా ఉండటంతో వంట గదిలో ఇట్టే ఇమిడిపోతుంది. ఆటోమేటిక్ సేఫ్టీ కట్‌ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. 3 నిమిషాలు వినియోగించకపోతే దానంతట అదే పవర్ ఆఫ్ అయిపోతుందట. ఒక్కో ప్రింటర్ రూ.13 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment