![Dosa Challenge: Finish 6 Feet Long Dosa At Delhis Dosa Factory - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/7/dosa4.jpg.webp?itok=DXjKLaa9)
మనసు దోచే దోసె గురించి ఎంత చెప్పినా తక్కువే. దోసె ప్రియుల కోసం సరికొత్త ‘ఫుడ్ చాలెంజ్’ ముందుకు వచ్చింది. ‘ఆరడుగుల పొడవు ఉన్న దోసెను ఒక్క సిట్టింగ్‌లో తినగలరా?’ అనే సవాలు విసురుతుంది ఈ ఫుడ్ చాలెంజ్. విజేత పొట్టశ్రమ వృథా పోదు. పదకొండు వేల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తారు.
పాపులర్ బ్లాగర్స్ వాణి, సావిలు ‘సమ్‌వన్ హు కెన్ ఫినిష్ దిస్?’ ట్యాగ్‌తో పోస్ట్ చేసిన ‘ఫుడ్ చాలెంజ్’ 5.7 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్ ‘దోసె ఫ్యాక్టరీ’లో ఈ ఆరు అడుగుల దోసెను తయారు చేయడంతోపాటు షూట్ చేశారు. మూడు రకాల మసాలాలు, నెయ్యితో తయారు చేసిన ఈ మెగా దోసెకు సాంబార్, చట్నీ, రవ్వ కేసరి కాంబినేషన్‌లుగా ఉంటాయి. ‘టైమ్ లిమిట్ లేకపోతే ఈజీగా లాగించవచ్చు’ అని కొందరు నెటిజనులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment