నోరూరించే ఎగ్‌ దోశ వేసిన హీరోయిన్‌ | Movie Shooting Spot, Aishwarya Rajesh Preparing Egg Dosa | Sakshi
Sakshi News home page

నోరూరించే ఎగ్‌ దోశ వేసిన హీరోయిన్‌

Published Sat, Mar 7 2020 4:06 PM | Last Updated on Thu, Mar 21 2024 11:40 AM

నిత్యం షూటింగ్‌లు, మూవీ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉండే నటీనటులు ఏ మాత్రం కాస్త సమయం దొరికితే ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా కోలీవుడ్‌లో బిజీ మారిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్‌ షూటింగ్‌ స్పాట్‌లో నోరూరించే వేడివేడి ఎగ్‌దోశ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తను దోశ వేసిన వీడియోను ఐశ్వర్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్‌ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. పా.రంజిత్‌ నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి దర్శకుడు అమీర్‌ శిష్యుడు సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో నాని ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో కూడా నటిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement